News December 11, 2024

60 ఏళ్లలో వ్యాపారం స్టార్ట్ చేసి.. రూ.49వేల కోట్లకు!

image

ఒకప్పుడు సాధారణ ఉద్యోగ జీవితం గడిపిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. 1990లో LIC నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ గ్రూప్‌ను స్థాపించారు. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం 94 సంవత్సరాల వయస్సులో రూ.49,110 కోట్లతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Similar News

News February 3, 2026

ఆదిలాబాద్ జిల్లాలో ఐదు చెక్ పోస్టులు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. అక్రమ మద్యం, నగదు, బహుమతులు తరలకుండా కఠినంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఐదు ఎస్‌ఎస్‌టి చెక్ పోస్టులలో 24 గంటలు వాహనాల తనిఖీ జరుగుతుందని, రూ.50 వేలకుపైగా నగదు ఉంటే సరైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు స్వామి, ఫనిధర్ ఎస్ఐ విష్ణువర్ధన్ పాల్గొన్నారు.

News February 3, 2026

42% సీట్లు ఏవి?: పార్టీలకు BCల సెగ

image

TG: మున్సి‘పోల్స్’లో నామినేషన్లు ముగిశాయి. చాలా చోట్ల పార్టీ టికెట్ల కోసం గొడవలు జరిగాయి. స్థానిక సంస్థల్లో BCలకు 42% సీట్లు ఇస్తామన్న INC, BRS, BJPకి వారి నుంచి అసంతృప్తి సెగ గట్టిగానే ఉంది. అధికారిక 32% రిజర్వేషన్ సీట్లు సహా మిగతా వాటిని పార్టీ పరంగా ఇస్తామన్నాయి. ఇప్పుడేమో చేతులెత్తేశాయి. దీంతో BCల నుంచి నిరసన వస్తుండడంతో పార్టీలకు దిక్కుతోచడం లేదు. ప్రచారాల్లో ఏం చెప్పాలోనని తల పట్టుకున్నాయి.

News February 3, 2026

అసభ్యంగా తాకాడు.. చెంపపై ఒక్కటిచ్చా: నటి రేవతి సెన్సేషనల్ కామెంట్స్

image

80వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన రేవతి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన టీనేజ్ రోజుల్లో జరిగిన ఒక ఘటనను గుర్తు చేసుకున్నారు. ‘11వ తరగతి చదువుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తుంటే ఒక వ్యక్తి అసభ్యంగా తాకాడు. అస్సలు భయపడకుండా వెంటనే అతణ్ని అందరి ముందే చెంపపై కొట్టా. ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే భయపడకుండా ఎదురుతిరగమని మా అమ్మ ఇచ్చిన ధైర్యమే నన్ను అలా చేయించింది’ అని రేవతి పేర్కొన్నారు.