News December 11, 2024

60 ఏళ్లలో వ్యాపారం స్టార్ట్ చేసి.. రూ.49వేల కోట్లకు!

image

ఒకప్పుడు సాధారణ ఉద్యోగ జీవితం గడిపిన లక్ష్మణ్ దాస్ మిట్టల్.. 60 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని మొదలు పెట్టి సక్సెస్ అయ్యారు. 1990లో LIC నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత సోనాలికా ట్రాక్టర్స్ గ్రూప్‌ను స్థాపించారు. తర్వాత కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో కలిసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. ప్రస్తుతం 94 సంవత్సరాల వయస్సులో రూ.49,110 కోట్లతో అత్యంత వృద్ధ బిలియనీర్‌గా ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Similar News

News January 26, 2025

వీర జవాన్లకు సీఎం రేవంత్ నివాళి

image

TG: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని వీర జవాన్ల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికుల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం సీఎం అక్కడే జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొంటారు.

News January 26, 2025

వెబ్‌ సిరీస్ చూసి.. భార్యను ముక్కలుగా నరికి..

image

భార్యను ముక్కలుగా నరికిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. శవాన్ని ఎలా ముక్కలు చేసి, మాయం చేయాలి? అనే విషయాలను నిందితుడు గురుమూర్తి OTTలోని ఓ క్రైమ్ వెబ్‌సిరీస్‌లో చూసినట్లు విచారణలో తేలింది. ముక్కలను కరిగించడానికి అవసరమైన కెమికల్స్ కోసం యూట్యూబ్‌ వీడియోస్ చూశాడట. సెన్సార్ కట్‌లు లేకుండా OTTలో ఏదైనా చూపించడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని నెటిజన్లు మండిపడుతున్నారు. మీరేమంటారు?

News January 26, 2025

డా.నాగేశ్వర్‌రెడ్డి గురించి తెలుసా?

image

దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా డా. నాగేశ్వర్‌రెడ్డి నిలిచారు. 2002లో పద్మ శ్రీ, 2016లో పద్మ భూషణ్ అందుకున్న ఆయనకు కేంద్రం తాజాగా పద్మ విభూషణ్ ప్రకటించింది. వైజాగ్‌లో జన్మించిన ఆయన కర్నూలులో MBBS, మద్రాస్‌లో MD, చండీగఢ్‌లో DM పూర్తి చేశారు. అంచెలంచెలుగా ఎదిగి HYDలో AIG ఆస్పత్రిని స్థాపించారు. రూ.కోట్ల జీతం కోసం విదేశాలకు వెళ్లకుండా ఇక్కడే వైద్య సేవలను అందిస్తున్నారు.