News March 28, 2024
బట్లర్ ఫ్లాప్ షో.. 5 మ్యాచుల్లో 22 పరుగులే..

IPL-2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచులో LSGపై 11 రన్స్కే ఔటైన అతడు.. ఇవాళ ఢిల్లీ మ్యాచులోనూ 11 పరుగులకే వెనుదిరిగాడు. గత సీజన్ చివరి 3 మ్యాచుల్లోనూ బట్లర్ డకౌట్ కావడం గమనార్హం. IPLలో గత 5 మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్ 22 మాత్రమే. మంచి హిట్టర్గా పేరున్న బట్లర్ ఫామ్ RR అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
Similar News
News January 21, 2026
వారన్ బఫెట్ బెస్ట్ డెట్ రూల్స్

– సేవింగ్స్ కంటే, మీ రుణాల్లో అధిక వడ్డీవి క్లియర్ చేయడం ముఖ్యం.
– ఫైనాన్షియల్ ఫ్రీడమ్ భ్రమలో క్రెడిట్ కార్డ్స్ వాడవద్దు
– పరిమితంగా, పరిమితుల్లో జీవించడం అలవర్చుకోవాలి
– లాంగ్ టర్మ్ స్టెబిలిటీ, ఫోకస్తోనే పెట్టుబడులు ఉండాలి
– ఏది కొనాలి అన్పించినా.. నాకు ఇది తప్పక అవసరమా? అని ప్రశ్నించుకోవాలి
– స్కిల్స్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్పై ఖర్చును పెట్టుబడిగా భావించి ప్రాధాన్యమివ్వాలి
News January 21, 2026
కొనసాగిన నష్టాలు

స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఉదయం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపే మొగ్గు చూపారు. ఒకానొక దశలో సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకొని చివరికి 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు కోల్పోయి 25,157 వద్ద సెటిల్ అయింది.
News January 21, 2026
అమరావతికి చట్టబద్ధత.. పార్లమెంటులో బిల్లు!

AP రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో బిల్లు పెట్టేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపైనా నోట్ ఇచ్చింది. కాగా ఏ తేదీ నుంచి రాజధానిగా గుర్తించాలో చెప్పాలని కేంద్రం కోరినట్లు సమాచారం.


