News March 28, 2024
బట్లర్ ఫ్లాప్ షో.. 5 మ్యాచుల్లో 22 పరుగులే..

IPL-2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచులో LSGపై 11 రన్స్‌కే ఔటైన అతడు.. ఇవాళ ఢిల్లీ మ్యాచులోనూ 11 పరుగులకే వెనుదిరిగాడు. గత సీజన్ చివరి 3 మ్యాచుల్లోనూ బట్లర్ డకౌట్ కావడం గమనార్హం. IPLలో గత 5 మ్యాచుల్లో అతడు చేసిన స్కోర్ 22 మాత్రమే. మంచి హిట్టర్‌గా పేరున్న బట్లర్ ఫామ్ RR అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
Similar News
News February 18, 2026
నేరేడు పూత, పిందె దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నేరేడు చెట్లకు ఫిబ్రవరి ఆఖరు నుంచి లేదా మార్చి తొలి వారంలో నీటి వసతిని ఏర్పాటు చేసుకుంటే పూత రాలకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ వచ్చిన పూత రాలుతున్నట్లు గమనిస్తే 15 లీటర్ల నీటిలో ప్లానోఫిక్స్ అనే మందు 3 గ్రాములను కలుపుకొని ఒకసారి పిచికారీ చేయాలి. దీని వల్ల పూత రాలడం తగ్గి, పిందె కట్టడానికి, పిందె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కాయ నాణ్యత పెంచడానికి కూడా ఈ మందు కొంత సాయం చేస్తుంది.
News February 18, 2026
కలియుగ వైకుంఠవాసా.. నువ్వు లేవని ఎవరన్నారయ్యా!

స్వామీ! నువ్వు లేవని ఎవరైనా అనగలరా? నీ ఏడుకొండల గాలి, నీ గోవింద నామం.. నాస్తికుడిని సైతం ఆస్తికుడిగా మార్చగలవు. నీ దివ్య మంగళ రూపం రాయిలాంటి హృదయాన్ని కూడా ముగ్థులను చేయగలదు. నిన్ను చూడాలని వచ్చిన ఎవ్వరినైనా నీ కరుణా సముద్రంలో మునిగేలా చేస్తావు. నీ దివ్య సౌందర్యానికి దాసోహం చేసుకుంటావు. ఆనంద నిలయంలో కొలువైన నిన్ను చూశాక భక్తుల కళ్లలో వెలిగే ఆనంద బాష్పాలే నీ ఉనికికి సాక్ష్యాలు.
News February 18, 2026
805 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC)లో 805 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో HYDలో 105 పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి 60%మార్కులతో BE/BTech, ME/MTech, PG(సైన్స్), MCA, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cdac.in


