News July 29, 2024
ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నారా?

ఈవీలపై ఇచ్చే సబ్సిడీ గడువును కేంద్రం పొడిగించింది. జులై 31తో సబ్సిడీ ముగియనుండగా దాన్ని సెప్టెంబర్ 30 వరకు పెంచుతున్నట్లు గెజిట్ విడుదల చేసింది. దీని ప్రకారం టూవీలర్ కొనుగోలుపై రూ.10,000 వరకు, స్మాల్ త్రీవీలర్‌పై రూ.25వేల వరకు, లార్జ్ త్రీవీలర్‌పై రూ.50వేల వరకు సర్కార్ సబ్సిడీ ఇస్తుంది. దేశంలో ఈవీల వాడకాన్ని పెంచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News November 29, 2025
MHBD: చలికాలంలో పల్లెల్లో ఎన్నికల వేడి..!

చలికాలం పల్లెల్లో ఎన్నికల వేడి మొదలైంది. MHBD జిల్లాలో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రావడంతో పల్లె పోరుకు రె‘ఢీ’ అవుతున్నారు. పల్లెల్లో రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరిని నిలపాలి? ఏ కుటుంబానికి గ్రామంలో బలం ఉంది? గతంలో పనిచేసిన, గ్రామానికి ఉపయోగపడిన వ్యక్తుల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. రిజర్వేషన్లు, వర్గ ఓట్లపై రాజకీయ పార్టీలు నిశితంగా లెక్కలు వేస్తున్నాయి.
News November 29, 2025
రోహిత్ శర్మ ముంగిట అరుదైన రికార్డులు

SAతో వన్డే సిరీస్‌కు ముందు రోహిత్‌ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి. 3 సిక్సులు బాదితే ODI ఫార్మాట్లో లీడింగ్ సిక్స్ హిట్టర్‌గా నిలుస్తారు. అలాగే 98 రన్స్ చేస్తే 20వేల అంతర్జాతీయ పరుగులు పూర్తవుతాయి. 213 రన్స్ కొడితే 16వేల పరుగులు పూర్తి చేసుకున్న ఓపెనర్‌గా అవతరిస్తారు. ఓ సెంచరీ చేస్తే అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్‌గా రికార్డ్ సృష్టిస్తారు. SAతో 3 వన్డేల సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.
News November 29, 2025
ChatGPTలో ఇది ఎప్పుడైనా గమనించారా?

అడ్వాన్స్డ్ AI టూల్ అయిన ChatGPT టైమ్ చెప్పలేకపోవడం చర్చగా మారింది. దీనికి ప్రధాన కారణంగా ChatGPTకి సిస్టమ్ టైమ్‌కు నేరుగా యాక్సెస్ ఉండకపోవడం. రియల్‌టైమ్ డేటా చేర్చడానికి కొన్ని టెక్నికల్ సమస్యలు ఉండటంతో పాటు AI గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే Gemini, Copilot, Grok వంటి AI టూల్స్ మాత్రం ఆటోమేటిక్‌గా టైమ్ చెప్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు OpenAI పనిచేస్తోంది.


