News May 20, 2024

2027 నాటికి AIపై వ్యయం రూ.41,500 కోట్లు!

image

ఇండియాలో AIపై ఖర్చు పెట్టే మొత్తం మూడేళ్లలో 3 రెట్లు పెరిగే అవకాశం ఉందని ఇంటెల్-ఐడీసీ నివేదిక వెల్లడించింది. 2023లో ₹14,000 కోట్లు వెచ్చించగా, 2027నాటికి ఈ ఖర్చు ₹41,500 కోట్లకు చేరొచ్చని అంచనా వేసింది. మౌలిక సదుపాయాలు, కస్టమర్ సర్వీస్, డిజిటల్ అసిస్టెన్స్‌పై ప్రధానంగా వ్యయం చేస్తున్నారని పేర్కొంది. అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద AI మార్కెట్‌గా మనదేశం ఉందని, 20% డేటా ఉత్పత్తి అవుతోందని తెలిపింది.

Similar News

News December 10, 2024

ఎంపీతో తన స్థాయి తగ్గిందన్న కృష్ణయ్య.. మళ్లీ అదే పదవి!

image

బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య BJP నుంచి రాజ్యసభ స్థానాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఆయన YCPకి, రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కృష్ణయ్య <<14226660>>మాట్లాడుతూ<<>> తన 50 ఏళ్ల పోరాటంలో ఎంపీ చిన్న పదవని చెప్పారు. దాని వల్ల తన స్థాయి తగ్గిందన్న ఆయన ఇప్పుడు మళ్లీ అదే పదవి తీసుకోవడం కరెక్టేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. TDP, YCP, ఇప్పుడు బీజేపీలో చేరికపై విమర్శిస్తున్నారు.

News December 10, 2024

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తారు. మూడు రోజులపాటు ఆయన అక్కడే ఉంటారు. బుధవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జైపుర్ వెళ్తారు. అక్కడ జరిగే బంధువుల వివాహంలో ఆయన పాల్గొంటారు. అనంతరం మళ్లీ హస్తిన చేరుకుని కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ కమిటీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి.

News December 10, 2024

మోదీని పడగొట్టాలన్న సొరోస్ వైఖరికే కట్టుబడ్డారా: USకు BJP ప్రశ్న

image

మోదీ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న జార్జ్ సొరోస్ వైఖరికే కట్టుబడ్డారో లేదో చెప్పాలని అమెరికాను BJP డిమాండ్ చేసింది. భారత్‌పై విషం చిమ్ముతున్న OCCRP మీడియా సంస్థకు సొరోస్‌తో పాటు US డీప్‌స్టేట్ ఫండింగ్ ఇవ్వడాన్ని గుర్తుచేసింది. వీటితో చేతులు కలిపే రాహుల్ గాంధీ భారత ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని ఆరోపించింది. OCCRP కొందరి ఒత్తిడితో తప్పుడు రాతలు రాస్తోందని ఫ్రెంచ్ జర్నలిస్టు బయటపెట్టారని తెలిపింది.