News July 22, 2024
2050 నాటికి భారత్లో వృద్ధుల సంఖ్య డబుల్!

భారత్లో వృద్ధుల జనాభా 2050 నాటికి రెండింతలు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) వెల్లడించింది. 60ఏళ్లుపైబడిన వృద్ధుల సంఖ్య 346 మిలియన్లకు చేరుతుందని వివరించింది. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలే ఉంటాయని అంచనా వేసింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉందని UNFPA భారత అధ్యక్షురాలు ఆండ్రియా వోజ్నార్ పేర్కొన్నారు.
Similar News
News November 25, 2025
సిద్దిపేట జిల్లాలో మూడు విడుతలుగా ఎన్నికలు

సిద్దిపేట జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడత హుస్నాబాద్ డివిజన్లో నవంబర్ 27న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. రెండవ విడత సిద్దిపేట డివిజన్లో నవంబర్ 30న నామినేషన్లు మొదలై డిసెంబర్ 14న పోలింగ్ ఉంది. మూడవ విడత గజ్వేల్ డివిజన్లో డిసెంబర్ 3న నామినేషన్లు ప్రారంభమై డిసెంబర్ 17న పోలింగ్ జరుగుతుంది.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>