News July 7, 2024
ఈ 10న దేశంలో 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు
ఈ నెల 10న దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలవగా, మరికొన్న చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు మరణించడంతో వీటిని నిర్వహిస్తున్నట్లు ఈసీ తెలిపింది. రాష్ట్రాలవారీగా చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో 4, హిమాచల్ 3, ఉత్తరాఖండ్ 2, బిహార్ 1, తమిళనాడు 1, పంజాబ్ 1, ఎంపీలో 1 స్థానానికి బై ఎలక్షన్స్ జరగనున్నాయి. ఫలితాలను ఈ నెల 13న వెల్లడిస్తారు.
Similar News
News December 10, 2024
మంత్రివర్గంలోకి నాగబాబు.. అంబటి సెటైర్
AP: నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైర్ వేశారు. ‘ప్రభుత్వం అంటే మల్టీ స్టారర్ మూవీ అనుకుంటున్నారు.. పాపం’ అని Xలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, నాగబాబును ట్యాగ్ చేశారు.
News December 10, 2024
అతిగా నిద్రపోతున్నారా?
పెద్దవారికి రోజుకు 7-8 గంటల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నిద్ర గుండెకు చేటు చేస్తుందని, వెన్నునొప్పి వస్తుందని అంటున్నారు. దీంతో పాటు టైప్-2 మధుమేహానికి కారణమవుతుందట. ఎక్కువ సమయం నిద్రలో ఉంటే ‘సెరెటోనిన్’ స్థాయులు తగ్గి మైగ్రేన్ వంటి సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు. 9గంటలకు పైగా నిద్రపోయి లేస్తే బద్ధకం ఆవరించి ఆ రోజంతా అలసటగా ఉంటుందట. మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో కామెంట్ చేయండి.
News December 10, 2024
రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు: కపిల్ దేవ్
అడిలైడ్ టెస్టులో IND ఓటమి తర్వాత రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అతనికి అండగా నిలిచారు. ‘రోహిత్ కెప్టెన్సీని అనుమానించొద్దు. అతను కొత్తగా నిరూపించడానికి ఏం లేదు. తిరిగి దృఢంగా పుంజుకుంటారని భావిస్తున్నా. ఒకట్రెండు ప్రదర్శనలతో కెప్టెన్సీని అనుమానిస్తే, అతను 6నెలల కిందటే టీ20 వరల్డ్ కప్ సాధించాడు. మరి దానిపై మనం ఏం ప్రశ్నిస్తాం’ అని కపిల్ అన్నారు.