News May 25, 2024
టూర్లకు బై.. కౌంటింగ్‌పై అభ్యర్థుల దృష్టి

AP: ఈ నెల 13న పోలింగ్ తర్వాత సేదతీరడానికి దేశ, విదేశాలకు వెళ్లిన అభ్యర్థులు క్రమంగా నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. పార్టీల అగ్రనాయకత్వం ఆదేశాలతో కౌంటింగ్ ప్రక్రియపై దృష్టిసారించారు. మండల స్థాయి నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలో అనుసరించాల్సిన నిబంధనలు, చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేస్తున్నారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏజెంట్లకు సూచిస్తున్నారు.
Similar News
News April 18, 2026
‘హార్ముజ్’ ఓపెన్.. ఇరాన్ 3 షరతులివే!

‘హార్ముజ్’ను ఓపెన్ చేసిన నేపథ్యంలో ఇరాన్ 3 కండిషన్స్ పెట్టినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
☛ జలసంధి గుండా కమర్షియల్ నౌకలకే అనుమతి ఉంటుంది. మిలిటరీ నౌకలకు ప్రవేశం లేదు.
☛ ఇరాన్ నిర్దేశించిన మార్గంలోనే షిప్స్ వెళ్లాలి.
☛ ఇరాన్ మిలిటరీతో కోఆర్డినేట్ చేసుకున్న తర్వాతే రాకపోకలు జరగాలి.
News April 18, 2026
GNT: తీర్పు నేడే.. మళ్లీ కస్టడీ దొరుకుతుందా?

అక్రమాస్తుల కేసులో అరెస్టైన దేవదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
News April 18, 2026
GREAT: 2,00,000 ప్రసవాలు చేసిన డాక్టర్

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 2 లక్షల మందికి ప్రాణం పోసిన ‘అమ్మ’ ఆమె. HYDకి చెందిన 92 ఏళ్ల డాక్టర్ సూరి శ్రీమతి 60 ఏళ్లుగా వైద్యమే శ్వాసగా జీవిస్తున్నారు. అప్పటి పరిమిత వసతుల నుంచి నేటి హైటెక్ వైద్యం వరకు ఆమె ప్రస్థానం అద్భుతం. వయసు భారమైనా నేటికీ సేవలందిస్తూ నిబద్ధతకు నిలువెత్తు రూపంగా నిలుస్తున్నారు. మాతాశిశు మరణాలను తగ్గించడంలో ఆమె చేసిన కృషి అనితరసాధ్యం. నేటి తరం వైద్యులకు నిజమైన రోల్ మోడల్.


