News May 11, 2024
ఇకపై పేటీఎంలోనూ క్యాబ్ బుకింగ్!

త్వరలోనే పేటీఎంలో క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ దిశగా పేటీఎం యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ద్వారా ఈ సేవలు అందించనుంది. మొదట ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ రైడ్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తోందని తెలుస్తోంది. పేటీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓలా, ఉబర్ వంటి సంస్థలకు పోటీ ఏర్పడనుంది.
Similar News
News October 15, 2025
ICAR-IARIలో 18 ఉద్యోగాలు..

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) 18 కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 31లోగా అప్లై చేసుకోవాలి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iari.res.in/
News October 15, 2025
‘తెలంగాణ విజన్’… మీ ఆలోచన ఏంటి?

తెలంగాణ రైజింగ్ విజన్-2047 పేరిట రాష్ట్ర ప్రభుత్వం ఓ డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని టాప్లో నిలబెట్టేలా ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. వ్యవసాయం, ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, స్థానిక సంస్థల బలోపేతం సహా పలు అంశాలపై ప్రతి పౌరుడు తప్పనిసరిగా OCT 25 లోగా ఈ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది. మీ ఆలోచన పంచుకోవడానికి <
News October 15, 2025
ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు

TG: సింగరేణి కార్మికులకు అక్టోబర్ 17న దీపావళి బోనస్ అందనుంది. పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డు(PLR)గా పిలిచే ఈ బోనస్ కింద ఈ ఏడాది రూ.1.03 లక్షల చొప్పున చెల్లించేలా బొగ్గు సంస్థల <<17842581>>యాజమాన్యాలు <<>>అంగీకరించాయి. కోల్ ఇండియా కింద ఉన్న అన్ని సంస్థలూ బోనస్ చెల్లించనుండగా, సింగరేణి మినహా మిగతా వారికి దసరా సమయంలోనే అందించారు. ఎల్లుండి సింగరేణి కార్మికుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.