News May 11, 2024
ఇకపై పేటీఎంలోనూ క్యాబ్ బుకింగ్!

త్వరలోనే పేటీఎంలో క్యాబ్ బుకింగ్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఆ దిశగా పేటీఎం యాజమాన్యం అడుగులు వేస్తోంది. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ONDC) ద్వారా ఈ సేవలు అందించనుంది. మొదట ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లో ఈ రైడ్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తోందని తెలుస్తోంది. పేటీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో ఓలా, ఉబర్ వంటి సంస్థలకు పోటీ ఏర్పడనుంది.
Similar News
News February 13, 2025
నేడు పార్లమెంటు ముందుకు కొత్త ఐటీ బిల్లు

నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు-2025ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు ఫైనాన్షియల్ ఇయర్, అసెస్‌మెంట్ ఇయర్ అనేవి ఉండగా ఇక నుంచి ‘ట్యాక్స్ ఇయర్’ అనే కాన్సెప్ట్ మాత్రమే ఉండనుంది. ఇది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కొత్త బిల్లు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే భాష సరళీకరణంగా ఉండనుంది. కొత్త బిల్లులో 526 సెక్షన్లు ఉండనున్నాయి.
News February 13, 2025
కులగణనపై రేపు పీసీసీ ప్రజెంటేషన్

TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన పీసీసీ రేపు మ.2 గంటలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీ భవన్‌లో జరిగే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కులగణన, ఎస్సీ వర్గీకరణపై మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.
News February 13, 2025
మార్చిలో భూమి మీదకు సునీతా విలియమ్స్

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ ఎట్టకేలకు మార్చిలో భూమి మీదకు రానున్నారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లి సాంకేతిక సమస్యలతో 8 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన ఆమె మార్చి మధ్యలో రానున్నట్లు NASA తెలిపింది. సునీతతో పాటు అక్కడే ఉన్న బుచ్ విల్మోర్ కూడా రానున్నట్లు పేర్కొంది. వీరిద్దరిని తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ సంస్థ వ్యోమనౌకను పంపనుందని వెల్లడించింది.