News September 18, 2024

బీసీలకు 33శాతం రిజర్వేషన్‌కు క్యాబినెట్ ఆమోదం

image

AP: వెనుకబడిన వర్గాల వారికి రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదలను ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. బీసీలు ఆర్థికంగా వెనుకబడి ఉండటానికి రాజకీయపరంగా వారికి తగిన అవకాశాలు లేకపోవడమేనన్న విషయాన్ని గుర్తిస్తూ క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.

Similar News

News November 15, 2025

గొర్రె పిల్లలకు వివిధ దశల్లో ఇవ్వాల్సిన ఆహారం

image

గొర్రె పిల్లల పెరుగుదలకు అందించాల్సిన ఆహారంపై వెటర్నరీ నిపుణుల సూచనలు
☛ పిల్ల పుట్టిన మొదటి 3 రోజుల వరకు: తల్లితో పాటు పిల్లను ఉంచి.. పిల్ల శరీర బరువులో 20 శాతం జున్నుపాలను ప్రతి రోజూ అందించాలి.
☛ తొలి 2 వారాల వరకు: పిల్లలను పూర్తిగా తల్లిపాల మీదనే ఉంచాలి. పుట్టిన పిల్ల శరీర బరువు 3 కిలోలు ఉంటే రోజుకి 600ml పాలు అందించాలి. తల్లి వద్ద సరిపడినన్ని పాలు లేకపోతే ఆవు లేదా గేదె పాలను అదనంగా అందించాలి.

News November 15, 2025

IIRSలో 11 పోస్టులకు నోటిఫికేషన్

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌ (<>IIRS<<>>) 11 JRF పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 21 నుంచి డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో ఎంటెక్, ఎంఈ, ఎంఆర్క్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు NET, GATE అర్హత సాధించి ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iirs.gov.in/

News November 15, 2025

ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

image

TG: జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.