News February 28, 2025
బడ్జెట్‌కు క్యాబినెట్ ఆమోదం

AP: రూ.3.24లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌కు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలోని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఆయన వెంకటాయపాలెంలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. బడ్జెట్ ప్రతులను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేశారు. అనంతరం వాటిని సీఎం, డిప్యూటీ సీఎంకు అందజేశారు.
Similar News
News March 22, 2025
ఈ ఏడాది నైరుతిలో వర్షపాతం సాధారణమే

జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కురిసే నైరుతి వర్షపాతం వ్యవసాయానికి కీలకం. ఈ ఏడాది అది సాధారణంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. నిరుడు డిసెంబరులో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి బలహీనమైన లానినా, ఈ ఏడాది మరింత బలహీనమవుతుందని వారు పేర్కొన్నారు. నైరుతి వచ్చేనాటికి ఎల్‌నినో వస్తుందని అంచనా వేశారు. పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా చల్లగాలులు భారత్‌లోకి ప్రవేశించడం వల్ల నైరుతి వర్షాలు కురుస్తుంటాయి.
News March 22, 2025
రాష్ట్రంలో కొత్తగా 70 బార్ల ఏర్పాటు!

TG: ఆదాయం పెంచుకునేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. కొత్తగా 70 బార్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా ఇన్‌కమ్ ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 1,171 బార్లు ఉండగా వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్నాయి. మైక్రోబూవరీల సంఖ్యను పెంచే అవకాశమున్నట్లు సమాచారం.
News March 22, 2025
టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.