News February 8, 2025

కొత్త ఐటీ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!

image

1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీన్ని సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. అనంతరం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపించనున్నట్లు తెలిపాయి. ఈ చట్టంలో అందరికీ అర్థమయ్యేలా సంక్షిప్తంగా IT రేట్లు, శ్లాబులు, TDS నిబంధనలు ఉంటాయని ఆర్థికమంత్రి నిర్మల ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News March 19, 2025

ముంబై ఫస్ట్ మ్యాచ్.. కెప్టెన్‌గా సూర్య

image

IPL-2025: ముంబై ఈ సీజన్లో ఆడే తొలి మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ హార్దిక్ పాండ్య వెల్లడించారు. గత సీజన్లో చివరి మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యపై నిషేధం పడింది. దీంతో ఆ స్టార్ ఆల్‌రౌండర్ మార్చి 23న చెన్నైతో జరిగే తొలి మ్యాచుకు అందుబాటులో ఉండరు.

News March 19, 2025

పాత ఫోన్.. గంటకు పైగా ఛార్జ్ చేస్తే పేలే ప్రమాదం

image

పాత ఫోన్లు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలోని చెడిపోయిన బ్యాటరీ స్థానంలో క్వాలిటీ లేని చైనా బ్యాటరీని అమర్చుతారని చెబుతున్నారు. అలాంటి బ్యాటరీని గంటకు పైగా ఛార్జ్ చేస్తే వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాగే ఫోన్‌ను ఎక్కువ సేపు ప్లగ్ ఇన్ చేసి ఉంచకూడదంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్ జిల్లాలో సెకండ్ హ్యాండ్ మొబైల్ పేలి ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

News March 19, 2025

సునీత.. మీరు పట్టుదల అంటే ఏంటో చూపించారు: మోదీ

image

ISS నుంచి భూమిపైకి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్, ఇతర వ్యోమగాములను PM మోదీ ప్రశంసించారు. ‘వెల్కమ్ బ్యాక్ crew9. మిమ్మల్ని భూమి చాలా మిస్ అయింది. పట్టుదల అంటే ఏంటో చూపించారు. ఎంతో మందికి మీరు స్ఫూర్తి. అంతరిక్ష అన్వేషణ అంటే సామర్థ్యానికి మించి సరిహద్దుల్ని దాటుకుని వెళ్లడం, కలల్ని నిజం చేసుకునే ధైర్యం ఉండటం. సునీత ఒక ఐకాన్. వారిని సురక్షితంగా తీసుకొచ్చిన వారి పట్ల గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!