News September 11, 2024
క్యాబినెట్ విస్తరణ.. ఎవరికి పదవి వస్తుందో?
TGలో క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం <<14076811>>ఫిక్సయినట్లు <<>>తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు కాంగ్రెస్‌లో పెద్ద చర్చగా మారింది. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న CM రేవంత్ మంత్రి పదవులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు. గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రాంమోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, షబ్బీర్ అలీ, అజారుద్దీన్ సహా పలువురు రేసులో ఉన్నారు.
Similar News
News October 5, 2024
దేశంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం!
కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైనట్టేనని హరియాణా, JK ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలుపొందిన ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇక ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్లు సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ అంచనాలు గనుక నిజమైతే దేశంలో కాంగ్రెస్ మరింత పుంజుకోవడం ఖాయమని పేర్కొంటున్నారు.
News October 5, 2024
శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఓపెనర్‌గా బరిలోకి
బంగ్లాదేశ్‌తో T20 సిరీస్‌లో సంజూ శాంసన్ ఓపెనర్‌గా వస్తారని కెప్టెన్ సూర్య కుమార్ ప్రకటించారు. సంజూతో అభిషేక్ శర్మ కూడా ఓపెనింగ్‌లో బ్యాటింగ్‌కు దిగుతారని చెప్పారు. కాగా ఈ సిరీస్‌లో రాణిస్తే సంజూకి జట్టులో స్థానం సుస్థిరమయ్యే అవకాశం ఉంది. అటు అతడికి ఛాన్సులు ఎక్కువగా రాకపోవడం, వచ్చినా ఉపయోగించుకోలేకపోవడంతో జట్టులో చోటుపై అనుమానాలు నెలకొన్నాయి. అందుకే ఈ సిరీస్ సంజూకి గోల్డెన్ ఛాన్స్ కానుంది.
News October 5, 2024
నన్నే ఎక్కువ టార్గెట్ చేశారు: ప్రియమణి
వేరే మతస్థుడిని ఎలా పెళ్లి చేసుకుంటావని కొందరు తనను ట్రోల్స్ చేశారని నటి ప్రియమణి తెలిపారు. ఇప్పటికీ ఆ ట్రోల్స్ ఆగడం లేదని ఆమె వాపోయారు. ‘2016లో ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థమైనప్పటి నుంచి నన్ను ట్రోల్స్ చేస్తున్నారు. ఎంతో మంది స్టార్లు కుల, మతాంతర వివాహం చేసుకున్నా నన్నే నిందించడం బాధించింది. కుల, మత వ్యత్యాసాలు ప్రేమకు ఉండవు. ఆ విషయం వారికి తెలిసినట్లు లేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.