News November 6, 2024
క్యాబినెట్ భేటీ ప్రారంభం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పూర్తి స్థాయి బడ్జెట్, నూతన క్రీడా విధానం, డ్రోన్, సెమీ కండక్టర్ పాలసీలు, ప్రభుత్య ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపుదలపై క్యాబినెట్‌లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఇటు నామినేటెడ్ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లపైనా చర్చించనున్నారు.
Similar News
News December 16, 2025
పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదు: కేటీఆర్

TG: పంచాయతీలకు ఫండ్స్ ఎవరి భిక్ష కాదని, అది రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సొంత ఇళ్లు అమ్మి కాంగ్రెస్ నేతలు నిధులివ్వడం లేదని ఫైరయ్యారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను చంపేస్తామని బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఖానాపూర్, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను తెలంగాణ భవన్‌లో ఇవాళ కేటీఆర్ సన్మానించారు.
News December 16, 2025
MAIDSలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని <
News December 16, 2025
సిడ్నీ దాడి.. నిందితులకు హైదరాబాద్ లింక్!

ఆస్ట్రేలియాలో కాల్పులకు తెగబడిన <<18568131>>తండ్రీకొడుకుల<<>> మూలాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. ‘సాజిద్ అక్రమ్(50)ది ఓల్డ్ సిటీ. ఇద్దరు సోదరులు, బంధువులు అక్కడే ఉన్నారు. 1998లో విద్యార్థి వీసాపై ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల కోసం గతంలో ఇండియాకు వచ్చాడు. అతడి కొడుకు నవీద్‌కు పుట్టుకతో ఆసీస్ పౌరసత్వం ఉంది’ అని భద్రతా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఇండియాతో ఆస్ట్రేలియా సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పాయి.


