News December 19, 2024

ముగిసిన క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు?

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో రూ.24,276 కోట్లతో పనులు, మంగళగిరి ఎయిమ్స్‌కు 10 ఎకరాల కేటాయింపు, వరద ప్రభావిత బాధితులకు రుణాల రీ షెడ్యూల్, పోలవరం ఎడమ కాల్వ పనులకు మళ్లీ టెండర్లు, కృషి విజ్ఞాన కేంద్రానికి 50.20 ఎకరాల బదిలీ, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు వంటి విషయాలపై చర్చించినట్లు సమాచారం.

Similar News

News January 19, 2025

ముగిసిన వానాకాలం ధాన్యం కొనుగోళ్లు

image

TG: వర్షాకాలం వరిధాన్యం సేకరణ ముగిసినట్లు సివిల్ సప్లయ్ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో 53.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు వెల్లడించారు. వీటిలో సన్న వడ్లు 23.73 లక్షల టన్నులు ఉన్నాయని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో మొత్తం రూ.12,022 కోట్లను జమ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఈ సారి సన్నవడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందజేసిన సంగతి తెలిసిందే.

News January 19, 2025

సైఫ్‌పై దాడిని అంగీకరించిన నిందితుడు

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసింది తానేనని <<15192921>>థానేలో అదుపులోకి తీసుకున్న వ్యక్తి<<>> అంగీకరించాడని ముంబై పోలీసులు తెలిపారు. అతడిని రెస్టారెంట్లో పనిచేసే మహమ్మద్ అలియాన్ అలియాస్ విజయ్ దాస్‌గా గుర్తించారు. చత్తీస్‌గఢ్‌లో అదుపులోకి తీసుకున్న వ్యక్తి నిందితుడు కాదని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి వివరాలను ఉ.9గంటలకు డీజీపీ ఆఫీసులో మీడియాకు వెల్లడిస్తామన్నారు.

News January 19, 2025

కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ ప్రధాని ట్విస్ట్

image

కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ట్విస్ట్ ఇచ్చారు. విడుదల చేసే బందీల పేర్ల జాబితాను వెల్లడించే వరకు ఈ ఒప్పందంలో తాము ముందుకు సాగలేమని చెప్పారు. తాము ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడట్లేదని పేర్కొన్నారు. ఏం జరిగినా హమాసే బాధ్యత వహించాలని తెలిపారు. అవసరమైతే అమెరికా అండతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని హెచ్చరించారు.