News June 13, 2024

18న కేబినెట్ భేటీ!

image

AP: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఈనెల 18న కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తర్వాతి రోజు 19న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేల ప్రమాణం, స్పీకర్ ఎన్నిక, బడ్జెట్ ఆమోదంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం తదితర అంశాలపై చర్చించేందుకు కేబినెట్ భేటీ కానున్నట్లు సమాచారం. ఈలోపే మంత్రులకు సీఎం శాఖలను కేటాయించనున్నారు.

Similar News

News September 18, 2024

వరద బాధితుల రుణాల రీషెడ్యూలింగ్‌కు అవకాశం

image

AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల రుణాలకు సంబంధించి బ్యాంకులు ఏడాది పాటు మారిటోరియం కల్పించాయని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ జే.నివాస్ తెలిపారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలు రూ.50 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారు రూ.25వేలు వినియోగ రుణాలు పొందొచ్చన్నారు. పంట రుణాలు, ఆటో, బైక్స్, కిరాణా షాపులు, హోటళ్లు, చిన్న పరిశ్రమలకూ రుణాల మారిటోరియంతో పాటు అవసరం మేరకు కొత్త రుణాలు పొందొచ్చన్నారు.

News September 18, 2024

చైనా పౌరుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు

image

వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైం రాకెట్ న‌డుపుతున్న చైనా పౌరుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాక‌రించింది. రెన్ చావోపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ పిటిషన్‌ను ప‌రిగ‌ణించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణలపై రెన్ చావోను నోయిడా పోలీసులు 2022లో అరెస్టు చేశారు. వ్యాపారం చేసే విదేశీయులు భారత చట్టాలకు లోబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు గతంలో అతని బెయిల్ తిరస్కరించింది.

News September 18, 2024

చక్కటి ఆలోచన.. అడవిలో కంటైనర్ స్కూల్

image

TG: దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఇవాళ ఈ పాఠశాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ ఇదే.