News June 19, 2024
24న కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

AP: ఈ నెల 24న ఉదయం పదింటికి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొత్త సర్కారు తొలి కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 21న సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. సీఎం సంతకం చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, డీఎస్సీ పోస్టుల భర్తీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలను ఈ సందర్భంగా ఆమోదించనున్నారు.
Similar News
News November 12, 2025
భారత్కు మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది: ఇజ్రాయెల్ పీఎం

ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనను ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. భారత్కు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ‘భారత్, ఇజ్రాయెల్ శాశ్వత సత్యాలపై ఆధారపడిన పురాతన నాగరికతలు. మన నగరాలపై దాడులు జరగొచ్చు. కానీ అవి మనల్ని భయపెట్టలేవు. ఇరు దేశాల వెలుగు శత్రువుల చీకట్లను తరిమేస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News November 12, 2025
బిహార్లో NDAకు 121-141 సీట్లు: Axis My India

బిహార్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని Axis My India ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. NDAకు 121-141, MGBకు 98-118 సీట్లు వస్తాయని పేర్కొంది. ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీ 0-2 సీట్లకు పరిమితం అవుతుందని తెలిపింది. NDAకు 43%, MGBకి 41% ఓట్ షేర్ వస్తుందని వివరించింది. అటు మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ NDA కూటమే గెలుస్తుందని అంచనా వేశాయి.
News November 12, 2025
ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం: సీఎం

AP: వచ్చే ఉగాదికి మరో 5.90 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు అందించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలు గృహప్రవేశాలు చేశాయని పేర్కొన్నారు. తాను అన్నమయ్య జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నానని ట్వీట్ చేశారు. ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి గౌరవం, సంతోషం, భవిష్యత్, భద్రత అని నమ్మి పాలన అందిస్తున్నామన్నారు.


