News June 19, 2024

24న కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

image

AP: ఈ నెల 24న ఉదయం పదింటికి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొత్త సర్కారు తొలి కేబినెట్ భేటీ జరగనుంది. భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఈ నెల 21న సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వ శాఖలకు సీఎంఓ ఆదేశాలు జారీ చేసింది. సీఎం సంతకం చేసిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, డీఎస్సీ పోస్టుల భర్తీ, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలను ఈ సందర్భంగా ఆమోదించనున్నారు.

Similar News

News September 9, 2024

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబుకు అస్వస్థత

image

TG: మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన అనారోగ్యానికి గురయ్యారని సమాచారం. దీంతో హుటాహుటిన ఆయనను గ్రీన్ ఛానెల్ ద్వారా ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. హరిబాబు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 9, 2024

ఏలేరు రిజర్వాయర్‌కు పోటెత్తిన వరద

image

AP: ఎగువన కురుస్తున్న వర్షాలతో కాకినాడ(D) ఏలేరు రిజర్వాయర్‌కు భారీ వరద వస్తోంది. ఇన్‌ఫ్లో 45,019, ఔట్‌ఫ్లో 21,775 క్యూసెక్కులుగా ఉంది. ఏలేశ్వరం- అప్పన్నపాలెం మధ్య కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాజుపాలెం వద్ద కాలువకు గండి పడింది. కాండ్రకోట వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. కిర్లంపూడి, పెద్దాపురం మండలాల్లో పంటలు నీట మునిగాయి. సమీప గ్రామల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

News September 9, 2024

ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్

image

ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్ ఉందని అధికారులు వెల్లడించారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలను అలర్ట్ చేశారు. రేపు ఉదయం 11.30 గంటల వరకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ఇచ్చారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.