News December 31, 2024

జనవరి 4న క్యాబినెట్ సమావేశం

image

TG: జనవరి 4 సాయంత్రం 4 గం.కు సచివాలయంలో మంత్రివర్గం సమావేశం కానుంది. భూమిలేని పేదలకు ఏడాదికి రూ.12వేల సాయం, రైతుభరోసా, కొత్త రేషన్ కార్డులు, టూరిజం పాలసీ, యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుపై చర్చించే అవకాశం ఉంది.

Similar News

News November 6, 2025

ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి ?

image

ఆయుష్షు కోరుకునేవారు తూర్పు ముఖంగా, కీర్తి, పేరు ప్రఖ్యాతలు కోరుకునేవారు దక్షిణ ముఖంగా కూర్చుని భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తూర్పు దిశ నుంచి ప్రాణ, సానుకూల శక్తి వస్తుంది. ఈ శక్తి భోజనం చేసేటప్పుడు శరీరంలోకి ప్రవహించి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆహారం ఆయురారోగ్యాలను ఇవ్వడానికి, ఉత్తమ ఫలితాలను పొందడానికి ఈ నియమాలు పాటించాలి. భోజనం చేసేటప్పుడు పద్మాసనంలో కూర్చోవడం, మౌనం పాటించడం మంచిది.

News November 6, 2025

5,346 టీచర్ పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ఢిల్లీలో 5,346 <>TGT<<>> పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ, పీజీ, బీఈడీతో పాటు సీటెట్ ఉత్తీర్ణులైనవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, మహిళలు, SC, ST, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://dsssb.delhi.gov.in/

News November 6, 2025

కానిస్టేబుల్ ట్రైనింగ్ ఇంకెప్పుడు?

image

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై 3 నెలలు పూర్తవుతున్నా ట్రైనింగ్ ప్రారంభం కాకపోవడంపై అభ్యర్థులు నిరాశ చెందుతున్నారు. వెంటనే శిక్షణ ప్రారంభించాలని కోరుతున్నారు. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు 2022 NOVలో నోటిఫికేషన్ వచ్చింది. ప్రిలిమ్స్‌ పూర్తయినా లీగల్ చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. గతేడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి ఆగస్టులో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా ట్రైనింగ్ ప్రారంభం కాలేదు.