News February 7, 2025
ఈ నెల 20న మంత్రివర్గ సమావేశం

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Similar News
News January 24, 2026
సెంటర్ సిల్క్ బోర్డ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News January 24, 2026
క్లీనింగ్ టిప్స్

* ఫర్నిచర్‌పై గీతలు పడితే వాటిని షూ పాలిషర్తో క్లీన్ చేస్తే పోతాయి.
* ఫ్లాస్కులో దుర్వాసన రాకుండా ఉండాలంటే లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క ఉంచండి.
* చెక్క వస్తువులను పాలిష్ చేయాలంటే వెనిగర్, వేడినీళ్ళు కలిపి క్లాత్‌తో తుడిస్తే కొత్తవాటిలా మెరుస్తాయి.
* బంగాళా దుంప తొక్కలతో గాజు వస్తువులను, అద్దాలను తుడిస్తే తళతళలాడతాయి.
News January 24, 2026
అలర్ట్.. 149 మిలియన్ల పాస్వర్డ్లు లీక్

ప్రపంచ వ్యాప్తంగా 149M(దాదాపు 15కోట్లు) యూజర్‌నేమ్‌లు, పాస్వర్డ్లు ఆన్లైన్లో లీక్ అయినట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఇందులో Gmail, FB, ఇన్‌స్టా, నెట్‌ఫ్లిక్స్, బ్యాంకింగ్, క్రిప్టో అకౌంట్ల వివరాలు ఉన్నాయి. ఇన్ఫోస్టీలర్ మాల్వేర్ ద్వారా ఈ సమాచారం చోరీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాస్వర్డ్లు మార్చుకోవాలని, ప్రతి అకౌంట్‌కు వేర్వేరుగా స్ట్రాంగ్‌గా ఉండేవి పెట్టుకోవాలని సూచిస్తున్నారు.


