News December 3, 2024

నేడు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డులు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్, రేషన్ స్మగ్లింగ్, పలు పెండింగ్ పనులపై చర్చిస్తారని సమాచారం. అలాగే వాలంటీర్ వ్యవస్థపై కూడా చర్చ జరిగే ఆస్కారం ఉందని తెలుస్తోంది.

Similar News

News January 17, 2025

కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు.. లోకేశ్ ట్వీట్

image

AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.

News January 17, 2025

సైఫ్ అలీఖాన్ గురించి తెలుసా?

image

సైఫ్ 1970లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించారు. పటౌడీ భారత క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. సైఫ్ 1991లో నటి అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. సారా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. 2012లో సైఫ్ కరీనా కపూర్‌ను పెళ్లాడారు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు. సైఫ్ ఆస్తి సుమారు రూ.1,200 కోట్లు ఉంటుంది.

News January 17, 2025

లోకల్ ఛానల్స్‌లో పైరసీ మూవీలు.. దిల్ రాజు వార్నింగ్

image

ప్రైవేటు వెహికల్స్, లోకల్ ఛానల్స్‌లో అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. ఇటీవల కొత్త సినిమాలను పర్మిషన్ లేకుండా ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నష్టం వాటిల్లుతుందన్నారు.