News January 4, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా విధివిధానాలు ఖరారు?
TG: సీఎం రేవంత్ అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రైతు భరోసా నిబంధనలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ విధివిధానాలను నేడు ఖరారు చేసే అవకాశముంది. దీంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, భూమి లేని పేదలకు భృతి, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, సమగ్ర కులగణనపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News January 24, 2025
ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన
దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.
News January 24, 2025
గ్రామాలకు మహర్దశ.. రోడ్ల నిర్మాణానికి రూ.2,773 కోట్లు మంజూరు
TG: ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు ఉండాలన్న CM రేవంత్ రెడ్డి <<15058155>>ఆదేశాల<<>> నేపథ్యంలో ప్రభుత్వం రూ.2,773కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.1,419కోట్లు, మరమ్మతులకు రూ.1,288కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం అమలు చేసే ‘పీఎం జన్‌మన్’ పథకానికి రాష్ట్ర వాటాగా రూ.66కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. గ్రామీణ రోడ్ల కోసం ప్రభుత్వం ఇప్పటికే తొలిదశలో రూ.2,682కోట్లు విడుదల చేసింది.
News January 24, 2025
దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
TG: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం అర్ధరాత్రి ఐటీ సోదాలు ముగిశాయి. మూడు రోజుల పాటు ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, బంధువుల నివాసాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో ఆయన తల్లి అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే.