News August 4, 2024
రేవంత్ US పర్యటన తర్వాత క్యాబినెట్ విస్తరణ?
TG: CM రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న రేవంత్ రాష్ట్రానికి చేరుకుని, ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి AICC అగ్రనేతలతో చర్చించనున్నట్లు టాక్. క్యాబినెట్‌లో 6 ఖాళీలుండగా, ప్రస్తుతానికి నలుగురిని తీసుకోనున్నట్లు సమాచారం. మిగతా 2 బెర్తులను వివిధ సమీకరణాల ప్రకారం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ విస్తరణ తర్వాత PCC చీఫ్‌ను కూడా నియమిస్తారట.
Similar News
News February 4, 2025
సుమతీ నీతి పద్యం- తాత్పర్యం
ఉదకము ద్రావెడు హయమును
మదమున నుప్పొంగుచుండు మత్తేభంబున్
మొదవుకడ నున్న వృషభము
జదువని యా నీచుకడకుజనకుర సుమతీ!
తాత్పర్యం: నీరు తాగే గుర్రం దగ్గరకు, విజృంభించే మదపుటేనుగు దగ్గరకు, ఆవు దగ్గర ఉన్న ఆబోతు వద్దకు, విద్యలేని నీచుడి దగ్గరకు వెళ్లకూడదు. వాటి వల్ల ప్రమాదం ఉంటుంది.
News February 4, 2025
అమరావతి రైల్వే లైన్ నాలుగేళ్లలో పూర్తి: నరేంద్ర పాటిల్
AP: ఈ ఏడాది JAN నాటికి విజయవాడ రైల్వే డివిజన్‌లో ₹4,856Cr ఆదాయం వచ్చిందని డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ చెప్పారు. బెజవాడ రైల్వే స్టేషన్ ఏడాదికి ₹500Cr ఆదాయం సాధిస్తోందన్నారు. ₹2,545Crతో ఎర్రుపాలెం-నంబూరు మధ్య అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. దీంతో అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడుతుందన్నారు.
News February 4, 2025
ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు
✒ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
✒ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
✒ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
✒ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
✒ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
✒ వరల్డ్ క్యాన్సర్ డే; ✒ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం