News April 28, 2024
ఏఐ రాకతో కాల్‌సెంటర్లు కనుమరుగు కావొచ్చు: టీసీఎస్ సీఈవో

కాల్ సెంటర్లకు భవిష్యత్తుపై TCS సీఈవో కృతివాసన్ విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఏఐ వచ్చే ఏడాదిలోపు కాల్‌సెంటర్ల అవసరం లేకుండా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. అధునాతన చాట్‌బాట్‌లు కస్టమర్ల లావాదేవీలను విశ్లేషించి.. కాల్ సెంటర్ ఏజెంట్ల అవసరాన్ని తగ్గించేస్తాయని చెప్పారు. AI ప్రాజెక్టులపై కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో భవిష్యత్తులో దాని వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నారు.
Similar News
News December 12, 2025
వైవాహిక అత్యాచారం నేరమే: శశి థరూర్

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా చూడకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. భార్యపై భర్త అత్యాచారాన్ని నేరంగా పరిగణించని దేశాలలో భారత్ ఒకటని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. కఠినమైన అత్యాచార చట్టాలు అమలులో ఉన్నా భర్తలకు మినహాయింపు దారుణమని కోల్‌కతాలో FICCI లేడీస్ ఆర్గనైజేషన్‌తో కలిసి ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ఇలా వ్యాఖ్యానించారు.
News December 12, 2025
ఇంటి చిట్కాలు మీకోసం

* గుడ్డులోని సొన కింద పడితే ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మరక ఆనవాళ్ళు ఉండవు.
* గాజు వస్తువులపై ఉప్పు చల్లి నీళ్ళతో రుద్దితే కొత్తగా మెరిసిపోతాయి.
* ఇనుప వస్తువులను ఉప్పుతో రుద్ది పొడి క్లాత్‌తో తుడిచి భద్రపరిస్తే ఎక్కువకాలం మన్నుతాయి.
* నిమ్మరసం, ఉప్పుతో రాగిసామగ్రిని రుద్దితే మెరిసిపోతాయి.
* చీమలు వచ్చే రంధ్రం దగ్గర కాస్త పెట్రోలియం జెల్లీ రాస్తే వాటి బెడద తగ్గుతుంది.
News December 12, 2025
రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న వినేశ్ ఫోగట్.. టార్గెట్ ఒలింపిక్స్

మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు SMలో వెల్లడించారు. 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పాల్గొంటానన్నారు. ‘ఆశయాలు, అంచనాల ద్వారా వచ్చిన ఒత్తిడితో ఆటకు దూరమయ్యాను. రెజ్లింగ్‌ను ఇంకా ప్రేమిస్తున్నానని తెలుసుకున్నాను. 18 నెలల విశ్రాంతి తర్వాత మళ్లీ పోటీ చేయాలనుకుంటున్నాను. ఈసారి నా కొడుకుతో కలిసి నడుస్తా’ అని చెప్పారు. 2024 AUG 8న ఆమె రిటైర్మెంట్ ప్రకటించారు.


