News April 28, 2024

ఏఐ రాకతో కాల్‌సెంటర్లు కనుమరుగు కావొచ్చు: టీసీఎస్ సీఈవో

image

కాల్ సెంటర్లకు భవిష్యత్తుపై TCS సీఈవో కృతివాసన్ విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఏఐ వచ్చే ఏడాదిలోపు కాల్‌సెంటర్ల అవసరం లేకుండా చేయొచ్చని అభిప్రాయపడ్డారు. అధునాతన చాట్‌బాట్‌లు కస్టమర్ల లావాదేవీలను విశ్లేషించి.. కాల్ సెంటర్ ఏజెంట్ల అవసరాన్ని తగ్గించేస్తాయని చెప్పారు. AI ప్రాజెక్టులపై కంపెనీలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో భవిష్యత్తులో దాని వినియోగం గణనీయంగా పెరుగుతుందన్నారు.

Similar News

News April 14, 2026

IPL: త్వరలోనే SRH జట్టులోకి కమిన్స్?

image

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టులోకి ఎప్పుడు తిరిగొస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా వచ్చి మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లిన ఆయనకు రేపు అక్కడ ఫిట్‌నెస్ టెస్ట్ జరగనున్నట్లు క్రిక్‌బజ్ వెల్లడించింది. ఈ నెల 17న ఆయన ఇండియాకు వస్తారని తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఆయన జట్టులో చేరే అవకాశం ఉంది. కొన్ని నెలలుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

News April 14, 2026

బిహార్ కొత్త సీఎం.. తల్లిదండ్రుల నుంచి రాజకీయ వారసత్వం

image

బిహార్ కొత్త CMగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి 1968లో జన్మించారు. ఈయన తండ్రి శకుని చౌదరి 7 సార్లు MLA, ఓసారి MPగా గెలిచారు. తల్లి పార్వతి తారాపూర్ MLAగా పని చేశారు. 1990లో RJD నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ఆ తర్వాత JDU, 2017లో BJPలో చేరారు. 2024 నుంచి Dy.CMగా ఉన్నారు. 2014-19, 2020-25 వరకు రెండుసార్లు MLCగా ఉన్నారు. కుశ్వాహా సామాజిక వర్గానికి చెందిన ఈయనకు ఆ వర్గంలో మంచి పట్టుంది.

News April 14, 2026

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

image

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.