News August 20, 2024

రేపు భారత్ బంద్‌కు పిలుపు

image

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి రేపు భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ర్యాలీలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. దీంతో రాజస్థాన్, మహారాష్ట్ర, యూపీ తదితర రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో బంద్ ప్రభావం ఎలా ఉంటుందనేది చూడాలి.

Similar News

News September 10, 2024

రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన ఏపీ విద్యుత్ ఉద్యోగులు

image

AP: వరద సహాయక చర్యల కోసం విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు జీతాన్ని విరాళం ఇచ్చారు. రూ.10.60 కోట్లను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పనిచేశారని, ఇప్పుడు ఒక రోజు జీతాన్ని సాయం చేశారని మంత్రి గొట్టిపాటి రవి కొనియాడారు. జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ రూ.2 కోట్లు, సీల్ సెమ్‌కార్ప్ థర్మల్ ప్రాజెక్టు రూ.50 లక్షలు, ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షలు సీఎం సహాయనిధికి అందజేశారు.

News September 10, 2024

విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

image

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) ఆరోగ్యం విషమంగా ఉందని ఆ పార్టీ ప్రకటించింది. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ రావడంతో ఆయన ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. పరిస్థితి విషమించడంతో ఆయనకు వైద్యులు ICUలో చికిత్స అందిస్తున్నారు. ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఇటీవల సీపీఎం ప్రకటించింది. తాజాగా మళ్లీ విషమంగా మారింది.

News September 10, 2024

ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

image

AP: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈనెల 1న ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.