News June 24, 2024
తొలిసారి పిలుపొచ్చింది

జింబాబ్వేతో T20 సిరీస్‌కు <<13502519>>జట్టు<<>>లో నలుగురు ఆటగాళ్లు తొలిసారి భారత్ తరఫున ఆడే అవకాశం దక్కించుకున్నారు. తెలుగు తేజం నితీశ్ రెడ్డి, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండేకు జట్టులో చోటు దక్కింది. వీరంతా తొలిసారి టీమ్ ఇండియా జెర్సీలో కనిపించనున్నారు. ఈ ఏడాది IPLలో ఈ ప్లేయర్లు సత్తా చాటిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన జురెల్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు.
Similar News
News February 8, 2025
ఓటర్లను ఆకర్షించిన BJP హామీలు

అన్ని రంగాలను ప్రభావితం చేసేలా BJP ప్రకటించిన మ్యానిఫెస్టో ఆ పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించింది. మహిళలకు నెలకు రూ.2,500, పేదలకు సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్, గర్భిణులకు రూ.21,000 ఇస్తామన్న BJPని ప్రజలు నమ్మారు. గిగ్ వర్కర్లతో పాటు వివిధ రంగాల్లో పని చేసే కార్మికులకు రూ.10లక్షల లైఫ్ ఇన్సూరెన్స్, ఢిల్లీలోని 1,700 అనధికార కాలనీ వాసులకు ఆస్తి హక్కులు, తదితర హామీలు ఓట్లు కురిపించాయి.
News February 8, 2025
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ హాలీవుడ్ నటుడు టోనీ రాబర్ట్స్(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన మరణించినట్లు కుమార్తె వెల్లడించారు. ప్లే ఇట్ ఎగైన్, సామ్, రేడియో డేస్, స్టార్ డస్ట్ మెమోరీస్, హన్నా అండ్ హర్ సిస్టర్స్, ద గర్ల్స్ ఇన్ ద ఆఫీస్, కీ ఎక్స్ఛేంజ్, డర్టీ డాన్సింగ్, మై బెస్ట్ ఫ్రెండ్స్ వైఫ్ సహా ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన గాయకుడు కూడా.
News February 8, 2025
‘విష’ ప్రచారం వర్కౌట్ కాలేదు

ఢిల్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక యమునా నది శుద్ధి ఎక్కడ అంటూ ప్రతిపక్షాలు AAP ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. తాను రివర్స్ కౌంటర్ ఇద్దామని భావించి హరియాణా ప్రభుత్వం యమునా నదిని విషంగా మార్చి సరఫరా చేస్తోందని కేజ్రీవాల్ ప్రచారం చేశారు. ఈ ఆరోపణలపై ఈసీ కూడా AKను వివరణ కోరింది. హరియాణా సీఎం సైనీ ఆ నీటిని తాగి చూపించిన వీడియోను రిలీజ్ చేయడంతో కేజ్రీ ‘విష’ ప్రచారం AAPకే బెడిసికొట్టింది.