News September 26, 2024
వాట్సాప్‌లో ‘కెమెరా ఎఫెక్ట్స్’ ఫీచర్
ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘కెమెరా ఎఫెక్ట్స్’ పేరిట మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సాయంతో యాప్‌లోని కెమెరాతో ఫొటోస్/వీడియోస్ తీసేటప్పుడు ఫిల్టర్స్ వాడుకోవచ్చు. వీడియో కాల్స్‌లో కూడా ఈ కొత్త విజువల్ టూల్స్‌ను ఉపయోగించవచ్చు. ప్రస్తుతం కొందరు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మిగతా యూజర్లకు త్వరలోనే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.
Similar News
News October 4, 2024
IPL: వీరిని ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదల్లేదు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఐదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదులుకోలేదు. వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ-సీఎస్కే, విరాట్ కోహ్లీ-ఆర్సీబీ, సచిన్ టెండూల్కర్-ముంబై ఇండియన్స్, సునీల్ నరైన్-కేకేఆర్, రిషభ్ పంత్-డీసీ ఉన్నారు. వీరిలో ధోనీ మినహా అందరూ ఒకే జట్టుకు ఆడారు. IPL-2025 సీజన్‌కు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకే ఆడతారని అంచనా. వీరి రిటెన్షన్లపై ఆయా ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.
News October 4, 2024
మోదీ డైరెక్షన్‌లో పవన్ నటన: షర్మిల
AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దీనిపై త్వరలోనే అఖిలపక్షంతో కలిసి సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. ‘ప్రధాని మోదీ డైరెక్షన్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి పవన్‌కు లేదు. లడ్డూ వ్యవహారంపై స్పెషల్ సిట్‌ను ఆహ్వానిస్తున్నాం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
News October 4, 2024
గోళ్లను బట్టి ఆరోగ్యాన్ని చెప్పొచ్చు: పోషకాహార నిపుణులు
గోళ్లు చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చని న్యూట్రీషనిస్ట్ సిమ్రున్ చోప్రా చెబుతున్నారు. ‘సన్నగా, మెత్తగా ఉండే గోళ్లు విటమిన్ బి, కాల్షియం, ఐరన్ లోపానికి సూచన కావొచ్చు. స్పూన్‌లా మధ్యలో గుంట పడినట్లుగా ఉండే గోళ్లు రక్తహీనత, లివర్ సమస్యలను, తెల్ల మచ్చలుండే గోళ్లు జింక్ లోపాన్ని సూచిస్తుండొచ్చు. అధిక ధూమపానానికి, థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలకు పసుపు రంగు గోళ్లు సూచన కావొచ్చు’ అని వివరించారు.