News February 3, 2025
ఢిల్లీలో ముగిసిన ప్రచారం.. ఎల్లుండి పోలింగ్

ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 70 ఎమ్మెల్యే సీట్లు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి ఈ నెల 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. 8న ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం నడిచింది. వరుసగా రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్.. హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది. మరోవైపు 23 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కమలం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
Similar News
News February 15, 2025
BCలకు 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి: కవిత

TG: కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే తప్పులతడకగా ఉందని BRS MLC కవిత ఆరోపించారు. ఖమ్మంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ‘బీసీలకు 42శాతం కాదు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 48శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. కులగణన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టాలి. మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడమే బీజేపీ నేతల పని. జై భీమ్, జై బీసీ నినాదం ఒకచోటే ఉండాలి’ అని డిమాండ్ చేశారు.
News February 15, 2025
మహిళా క్రికెటర్‌కు హీరో శివ కార్తికేయన్ సాయం!

తాము కష్టాల్లో ఉన్నప్పుడు సినీ నటుడు శివ కార్తికేయన్ చేసిన సాయాన్ని భారత మహిళా క్రికెటర్ ఎస్ సంజన గుర్తు చేసుకున్నారు. ‘2018 వయనాడ్ వరదల్లో ఇళ్లు కోల్పోయాం. నా ట్రోఫీలు, క్రికెట్ కిట్ కొట్టుకుపోయాయి. అప్పుడు శివ కార్తికేయన్ కాల్ చేసి హెల్ప్ కావాలా అని అడిగారు. కొత్త స్పైక్స్ కావాలని అడిగిన వారంలోనే అవి నా చెంతకు చేరాయి. అప్పుడు నా చుట్టూ ఎంత మంది మద్దతుదారులున్నారో తెలిసింది’ అని చెప్పుకొచ్చారు.
News February 15, 2025
కుంభమేళా సమయం పొడిగించండి: అఖిలేశ్

ప్రయాగ్‌రాజ్‌కు వస్తున్న భక్తుల రద్దీ దృష్ట్యా మహాకుంభమేళాను 75 రోజులకు పొడిగించాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు. గతంలో ఒకసారి కుంభమేళా 75 రోజులపాటు జరిగిందని తెలిపారు. రద్దీ దృష్ట్యా 60 సంవత్సరాల పైబడిన వారు కుంభమేళాకు రాలేకపోతున్నారన్నారు. ఇప్పటివరకూ 60కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే 50కోట్ల మంది వచ్చినట్లు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇస్తోందని ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు.