News April 11, 2024
పవన్ తరఫున ప్రచారం చేస్తా: నవదీప్

AP: పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం చేస్తానని టాలీవుడ్ హీరో నవదీప్ తెలిపారు. నిజాయితీగా ఎవరు పోటీ చేసినా ప్రజలు ఆదరిస్తారని, పవన్‌కు తన మద్దతు ఉంటుందని వెల్లడించారు. తాను నటించిన ‘లవ్‌మౌళి’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా పిఠాపురంలోని శ్రీపాదవల్లభుడిని దర్శించుకున్న ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. ‘లవ్‌మౌళి’ ఈనెల 19న విడుదల కానుంది.
Similar News
News March 27, 2025
రోహిత్‌ను రోజూ 20KM పరిగెత్తమని చెప్తా: యువరాజ్ తండ్రి

దిగ్గజ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టీమ్ ఇండియాకు కోచ్‌గా నియమిస్తే రోహిత్ శర్మను రోజూ 20KM పరిగెత్తమని చెప్తానని అన్నారు. ప్రస్తుత ఆటగాళ్లతోనే ఎప్పటికీ ఓడించలేని జట్టుగా మారుస్తానని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పారు. రోహిత్, కోహ్లీని రంజీ ట్రోఫీలో ఆడించాలన్నారు. వారిద్దరూ వజ్రాల్లాంటి ప్లేయర్లని కొనియాడారు.
News March 27, 2025
ప్రపంచ కుబేరుల కొత్త జాబితా!

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఎలాన్ మస్క్ $420 బిలియన్ల(దాదాపు రూ.36 లక్షల కోట్లు)తో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. US ప్రెసిడెంట్‌గా ట్రంప్ ఎన్నికయ్యాక మస్క్ ఆస్తి భారీగా పెరిగినట్లు పేర్కొంది. ఇక రెండు, మూడు స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ నిలిచారు. వీరి తర్వాత వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ ఉన్నారు.
News March 27, 2025
ప్రభాస్ పెళ్లి వార్తలపై టీమ్ క్లారిటీ

రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి కుమార్తెను ఆయన వివాహం చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని ఖండించింది. అలాంటి వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అంతకుముందు భీమవరం అమ్మాయిని పెళ్లి చేసుకుంటారని జరిగిన ప్రచారాన్ని కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.