News December 10, 2024

రాజ్యసభకు అంటూ ప్రచారం.. అనుహ్యంగా మంత్రివర్గంలోకి

image

AP: రాష్ట్ర క్యాబినెట్‌లో చోటు కల్పిస్తున్నట్లు CM CBN ప్రకటించడంతో ఒక్కసారిగా నాగబాబు పేరు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 2019లో లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి ఓడారు. గత ఎన్నికల్లోనూ పోటీ చేస్తారనే వార్తలు వచ్చినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో రాజ్యసభ సీటు ఇస్తారని భావించినా బీజేపీ కృష్ణయ్య పేరును ప్రకటించింది. దీంతో ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారని తెలుస్తోంది.

Similar News

News November 18, 2025

మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

image

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్‌ను కాకుండా బ్యాలెట్‌ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.

PGIMERలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

image

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (<>PGIMER<<>>) 5ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు రేపు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి MDS,డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. వెబ్‌సైట్: https://pgimer.edu.in/