News March 28, 2024
బస్సు, ట్రైన్‌లో జంతువులను తీసుకెళ్లొచ్చా?

RTC బస్సులో చిలుకలకు టికెట్లు ఇవ్వడం చర్చనీయాంశమైంది. అయితే బస్సుల్లో కోళ్లు, మేకలు వంటి జంతువులకు అనుమతి లేదని RTC MD సజ్జనార్ తెలిపారు. రైళ్లలో మాత్రం పెంపుడు జంతువులను తీసుకెళ్లవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ AC టికెట్ బుక్ చేసుకోవాలి. ట్రైన్ ఎక్కే స్టేషన్ CROకు దరఖాస్తు ఇవ్వాలి. పెట్స్‌కు టీకాలు వేయించిన సర్టిఫికెట్, వాటి హెల్త్‌పై డాక్టర్ సర్టిఫికెట్ అవసరం.
Similar News
News February 10, 2026
జననాయగన్ సెన్సార్ వివాదం.. CBFCపై కేసు వెనక్కి!

జననాయగన్ సినిమా సెన్సార్ విషయంలో CBFCపై వేసిన కేసును వెనక్కి తీసుకునేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ సమర్పించారు. చట్టపరమైన చర్యలకు బదులు సినిమాలో మార్పులు చేసి మరోసారి రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నారు. జనవరి 9నే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ ఇష్యూస్‌తో వాయిదాపడ్డ విషయం తెలిసిందే.
News February 10, 2026
ఓటుకు రూ.30వేలు.. గెలిపిస్తే అర తులం బంగారం!

TG: మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు భారీగా వెచ్చిస్తున్నట్లు సమాచారం. ORR సమీపంలోని మున్సిపాలిటీలలో ఓటుకు ఏకంగా రూ.10-30వేల చొప్పున ఇస్తున్నారని తెలుస్తోంది. చేవెళ్లలోని 16వ వార్డులో ఓ అభ్యర్థి గెలిస్తే అర తులం బంగారం ఇస్తానని హామీ ఇచ్చాడు. చాలా చోట్ల ఓటుకు రూ.3-5వేల వరకు పంచడమే కాకుండా చికెన్/మటన్, మందు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
News February 10, 2026
PF విత్‌డ్రాకు ప్రత్యేక యాప్

UPI ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్‌లో PF సొమ్ము డిపాజిట్ అయ్యేలా కొత్త యాప్ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఉన్న UMANG యాప్‌నకు అదనంగా ఇది పనిచేస్తుంది. యాప్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుంటే 3రోజుల్లోనే గరిష్ఠంగా ₹5లక్షల వరకు డిపాజిట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం UPI ద్వారా PF విత్‌డ్రా చేసుకునే ఫీచర్ లేదు.


