News October 8, 2025
థైరాయిడ్ మందులు మానేయొచ్చా?

చాలామంది థైరాయిడ్ లెవల్స్ నార్మల్‌గా ఉన్నాయని మందులు వాడటం మానేస్తారు. కానీ ఇది సరికాదని, మందులు వాడటం వల్లే థైరాయిడ్ నార్మల్‌గా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే 12.5- 25mg వాడేవారు వీటిని ఆరు వారాల తర్వాత ఓసారి పరీక్షించుకొని నార్మల్‌గా ఉంటే మందులు వాడటం మానేయొచ్చని సూచిస్తున్నారు. అయితే థైరాయిడ్ సమస్య అదుపులో ఉన్నట్టు నిర్ధారణ అయినా డాక్టర్ సలహా మేరకే మందులు ఆపాలని చెబుతున్నారు.
Similar News
News October 8, 2025
ALERT.. ‘కాపీ పేస్ట్’ చేస్తున్నారా?

టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అట్రాక్ట్ చేసే కంటెంట్, టెక్ట్స్ మెసేజ్‌లతో యూజర్లను మాయచేస్తున్నారు. పాపప్స్ నమ్మి కంటెంట్ కాపీ పేస్ట్ చేస్తే ఫోన్లు, కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను పంపుతున్నారు. దీంతో డివైస్‌లు హ్యాక్ చేస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు డివైస్ అప్డేట్ చేయడంతో పాటు అనవసరమైన లింక్స్ క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు. SHARE
News October 8, 2025
మీరు వద్దనుకున్నవి.. వారికి సంతోషాన్నిస్తాయి!

దీపావళి సందర్భంగా అందరూ ఇళ్లు శుభ్రం చేసుకుంటూ పాత వస్తువులను బయట పారేస్తుంటారు. అయితే పనికొచ్చే వస్తువులను, దుస్తులను పడేసే ముందు ఓసారి ఆలోచించండి. మీరు వద్దనుకునే ఆ వస్తువులు ఎంతోమందికి ఉపయోగపడొచ్చు. బట్టలు, పుస్తకాలు, ఆట బొమ్మలు, వంట సామగ్రి, పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్ మొదలైన వస్తువులను అవసరమైన వాళ్లకు ఇచ్చేందుకు ముందుకురండి. చాలా NGOలు, శరణాలయాలు వీటిని స్వీకరిస్తాయి. SHARE IT
News October 8, 2025
పాడిరైతులకు భరోసా- ఉచిత పశుగ్రాసం సాగు పథకం

AP: వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ఉచిత పశుగ్రాసం సాగు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధిహామీ పథకం కింద వందశాతం రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్నిపెంచుకోవచ్చు. గరిష్ఠంగా రూ.32,992, కనిష్ఠంగా రూ.6,559 ప్రభుత్వ సాయంగా అందుతుంది.