News May 11, 2024

కోల్‌కతాను ముంబై నిలువరించేనా?

image

ఐపీఎల్‌లో ఇవాళ కోల్‌కతాతో ముంబై తలపడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. KKR వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది. దాదాపుగా ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. మరోవైపు ముంబై ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. ఇప్పటివరకు ఆ జట్టు 12 మ్యాచ్‌లు ఆడి నాలుగు గెలిచి ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.

Similar News

News November 17, 2025

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

image

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్‌‌లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.