News August 9, 2024
తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

చంటిబిడ్డకు తల్లిపాలే అమృతం. ఒకవేళ తల్లికి డయాబెటిస్ ఉంటే షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటేనే పాలివ్వాలంటున్నారు వైద్య నిపుణులు. తల్లికి షుగర్ ఎక్కువగా ఉంటే ఆ పాలు తాగిన బిడ్డలో చక్కెర స్థాయుల్ని నియంత్రించేందుకు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల చక్కెర స్థాయి పడిపోయే హైపోగ్లైసీమియా బిడ్డలో తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News November 13, 2025
కామారెడ్డి: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు శిక్షణ

కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గురువారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యవసాయ రంగంలో సమూహ బలం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
News November 13, 2025
మూడేళ్లు జైల్లో గడిపిన అల్-ఫలాహ్ ఫౌండర్!

అల్-<<18273804>>ఫలాహ్<<>> యూనివర్సిటీ ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ గురించి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. MPలో జన్మించిన సిద్ధిఖీ గతంలో 9 సంస్థలను నడిపారు. వాటిలో చాలా వరకు 2019 తరువాత మూసివేశారు. చీటింగ్, నకిలీ పత్రాలు సృష్టి, నిధుల మళ్లింపు వంటి అనేక ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. రూ.7.5 కోట్ల చీటింగ్ కేసులో మూడేళ్ల జైలు శిక్ష సైతం అనుభవించారు. దీంతో వర్సిటీ నిధులపై ED దర్యాప్తు చేస్తోంది.
News November 13, 2025
క్వాలిటీ స్పిన్నర్ల కోసం ముంబై వేట!

IPL: వచ్చే వేలానికి ముందు క్వాలిటీ స్పిన్నర్లను తీసుకోవాలని ముంబై ఇండియన్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కోల్కతా నైట్రైడర్స్ నుంచి మయాంక్ మార్కండే, సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి రాహుల్ చాహర్ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ ముంబై తరఫున ఆడి గుర్తింపు తెచ్చుకున్నారు. మయాంక్ 37 మ్యాచుల్లో 37, రాహుల్ 78 మ్యాచుల్లో 75 వికెట్లు తీశారు.


