News August 9, 2024
తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?

చంటిబిడ్డకు తల్లిపాలే అమృతం. ఒకవేళ తల్లికి డయాబెటిస్ ఉంటే షుగర్ స్థాయులు నియంత్రణలో ఉంటేనే పాలివ్వాలంటున్నారు వైద్య నిపుణులు. తల్లికి షుగర్ ఎక్కువగా ఉంటే ఆ పాలు తాగిన బిడ్డలో చక్కెర స్థాయుల్ని నియంత్రించేందుకు ఇన్సులిన్ అధికంగా ఉత్పత్తి అవుతుందని వివరిస్తున్నారు. అందువల్ల చక్కెర స్థాయి పడిపోయే హైపోగ్లైసీమియా బిడ్డలో తలెత్తే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
Similar News
News July 11, 2025
బీసీ రిజర్వేషన్లతో కాంగ్రెస్‌కు ‘పట్టు’ దొరికేనా?

TG: ఎన్నికల హామీ మేరకు BC రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఇటీవల BJPకి BCల మద్దతు పెరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రిజర్వేషన్లు అమలైతే రెడ్డి, SC వర్గాల్లో బలంగా ఉన్న INCవైపు BCలూ మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీంతో రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీకి బలం పెరుగుతుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మీరేమంటారు?
News July 11, 2025
పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹600 పెరిగి ₹99,000కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹550 పెరిగి ₹90,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 ఎగబాకి రూ.1,21,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News July 11, 2025
ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్ డేటా మొత్తం డౌన్‌లోడ్!

జపాన్ మరో సరికొత్త ఆవిష్కరణ చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సృష్టించింది. సెకనుకు 1.02 పెటా బైట్స్ వేగంతో (పెటా బైట్= 10లక్షల GBలు) ఇంటర్నెట్ డేటాను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ వేగంతో ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని డేటా మొత్తం లేదా 150 GB వీడియో గేమ్స్ డౌన్‌లోడ్ అవుతాయి. ఇది భారత సగటు ఇంటర్నెట్ వేగంతో (63.55 Mbps) పోలిస్తే 16 మిలియన్ రెట్లు వేగవంతమైంది.