News January 11, 2025

మార్చి 9న కెనడా కొత్త PM ప్రకటన

image

ట్రూడో రాజీనామా ప్రకటన నేపథ్యంలో కెనడా కొత్త PMని MAR 9న ప్రకటిస్తామని అధికార లిబరల్ పార్టీ తెలిపింది. ఆరోజు నిర్వహించే ఓటింగ్ ద్వారా నాయకుడిని ఎన్నుకుంటామని పేర్కొంది. అయితే కొత్తగా ఎన్నికయ్యే PMకి పెను గండం పొంచి ఉంది. మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వంపై MAR 24న పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఇందులో నెగ్గితేనే లిబరల్ పార్టీ నేత PMగా కొనసాగుతారు.

Similar News

News January 21, 2025

అమరావతిలో CII సెంటర్ ఏర్పాటు: చంద్రబాబు

image

AP: టాటా సంస్థ సహకారంతో రాజధాని అమరావతిలో సీఐఐ కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా సీఐఐ సెంటర్ ఏర్పాటు చేస్తాం. ట్రైనింగ్, అడ్వైజరీ సేవలతో ఇండస్ట్రీల్లో కాంపిటీషన్ పెంచుతాం. భారత్ 2047 విజన్ కోసం ముందుకు వెళ్తాం. సంపద సృష్టిలో భారతీయులు అగ్రగామిగా ఎదగాలి’ అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.

News January 21, 2025

ఈ నంబర్ల నుంచి కాల్ వస్తే..

image

ఫేక్ బ్యాంక్ కాల్స్ వల్ల మోసపోతున్న వారిని రక్షించేందుకు RBI కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లకు లావాదేవీలు & మార్కెటింగ్ కాల్స్ చేయడానికి రెండు ప్రత్యేక ఫోన్ నంబర్ సిరీస్‌లను ప్రవేశపెట్టింది. నంబర్ ‘1600’తో ప్రారంభమైతే బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించిన కాల్, ‘140’ సిరీస్‌తో వస్తే అది మార్కెటింగ్ కాల్ అని తెలిపింది. వీటి నుంచి కాల్స్/ మెసేజ్‌లు వస్తే బ్యాంకు పంపిందని అర్థం.

News January 21, 2025

రంజీ ఆడనున్న రోహిత్.. MCA కీలక నిర్ణయం

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు పదేళ్ల తర్వాత రంజీల్లో ఆడుతున్నారు. దీంతో MCA (ముంబై క్రికెట్ అసోసియేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై-జమ్మూకశ్మీర్ మ్యాచ్ జరిగే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మైదానంలో సీట్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించింది. హిట్‌మ్యాన్ ఆటను చూసేందుకు అభిమానులు భారీగా తరలివస్తారని, ఇందుకు తగినట్లుగా సీట్లు ఏర్పాటు చేయాలని భావించింది.