News January 6, 2025
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. దేశంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ట్రూడోకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని సర్వేలు తేల్చాయి. లిబరల్ పార్టీ కూడా ఇదే భావనలో ఉంది. దీంతో పార్టీ అధ్యక్ష, ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారు. కెనడాలో భారత వ్యతిరేక శక్తులకు సహకరిస్తున్న ఆయన ప్రభుత్వ తీరుపై అనేక విమర్శలున్నాయి.
Similar News
News January 26, 2025
విదేశీయులకు పద్మాలు.. అమెరికాకే అత్యధికం
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో 10 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా అమెరికాకు చెందినవారే ఉండటం గమనార్హం. ఒసాము సుజుకీ(వ్యాపారం-జపాన్)కి పద్మవిభూషణ్, వినోద్ ధామ్(సైన్స్ అండ్ ఇంజినీరింగ్-USA)కు పద్మభూషణ్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ నుంచి ఒక్కరి చొప్పున ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. అత్యధికంగా USA నుంచి ఐదుగురికి ఈ అవార్డులు దక్కాయి.
News January 25, 2025
‘పద్మ’ అవార్డులు ఈ రాష్ట్రానికే అత్యధికం
కేంద్రంలో ప్రకటించిన 139 ‘పద్మ’ అవార్డుల్లో అత్యధికంగా మహారాష్ట్ర(14)కు వరించాయి. ఆ తర్వాతి స్థానాల్లో యూపీ నుంచి 10 మంది, కర్ణాటక, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ నుంచి 9 మంది చొప్పున, బిహార్, గుజరాత్ నుంచి 8 మందికి ఈ పురస్కారాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కాయి. అస్సాం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐదుగురు చొప్పున ఈ అవార్డులకు ఎంపికయ్యారు.
News January 25, 2025
PHOTO: రిహార్సల్స్ మొదలుపెట్టిన మహేశ్ బాబు
రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైందని నిన్న జక్కన్న హింట్ ఇచ్చారు. తాజాగా మహేశ్ ఫొటో వైరలవుతోంది. ఆయన స్టంట్స్ ప్రాక్టీస్ చేసినట్లుగా తెలుస్తోంది. ట్రైనర్‌తో పాటు ఉన్న ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రిహార్సల్స్ మొదలయ్యాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.