News June 19, 2024

రద్దయింది NEET కాదు NET

image

కేంద్ర విద్యాశాఖ తాజాగా UGC NET-2024 (National Eligibility Test)ను రద్దు చేసింది. అయితే NEET, NET పేర్లు దాదాపు ఒకే రకంగా ఉండటంతో చాలా మంది NEET రద్దు చేశారని అయోమయపడుతున్నారు. కేంద్రం రద్దు చేసింది NETని మాత్రమే. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అర్హత కోసం NET నిర్వహిస్తే.. BDS, MBBS కోర్సుల్లో అడ్మిషన్లకు NEET (National Eligibility-cum-Entrance Test) నిర్వహిస్తారు.
>>SHARE IT

Similar News

News September 13, 2024

2.35 లక్షల మందిపై ‘యాగీ’ తుఫాను ప్రభావం

image

యాగీ పెనుతుఫాను కారణంగా మయన్మార్‌లో సంభవించిన వరదలతో 2,35,000 మంది నిరాశ్రయులయ్యారని, 33మంది కన్నుమూశారని అక్కడి సర్కారు తెలిపింది. పలు ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయని, నదీప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యాగీ కారణంగా వియత్నాం, లావోస్, థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడటంతో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు.

News September 13, 2024

‘హైడ్రా’పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

image

TG: సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. GHMC యాక్ట్‌ను కాదని, హైడ్రాకు అధికారాల బదిలీ ఎలా చేస్తారని పిటిషనర్‌ ప్రశ్నించారు. కాగా HYDలోని చెరువుల FTL, బఫర్ జోన్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తోంది.

News September 13, 2024

తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం

image

TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్‌, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.