News August 16, 2024
డ్రగ్స్‌తో పట్టుబడితే అడ్మిషన్ రద్దు?
TG: కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్‌తో పట్టుబడితే విద్యార్థుల అడ్మిషన్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటేనే విద్యార్థులు డ్రగ్స్ జోలికి వెళ్లరని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్ నివారణపై డీజీపీ, విద్యాశాఖాధికారులు, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు రేపు సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 17, 2024
రేపు పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభం: టీడీపీ
AP: YCP అధినేత జగన్ MLAగా ఉన్న పులివెందులలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు TDP వెల్లడించింది. ‘రేపు పులివెందుల గాంధీ సర్కిల్, 4రోడ్ల కూడలి వద్ద అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం ఉంది. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లపై తన ద్వేష బుద్ధి చూపిస్తున్న పులివెందుల MLA కూడా రావచ్చు. ప్రజలు కడుపునిండా అన్నం తినటం రెండు కళ్లతో చూడలేనని అనుకుంటే, బెంగళూరు ప్యాలెస్‌లోనే ఉండిపోవచ్చు’ అని ట్వీట్ చేసింది.
News September 17, 2024
గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొననున్న CM
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన వెంటనే మరి కాసేపట్లో ఆయన ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
News September 17, 2024
తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, బండి
TG: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. SECBAD పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అమర జవాన్ల స్తూపానికి, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుగుతోంది. అసెంబ్లీ ప్రాంగణం వద్ద స్పీకర్ ప్రసాద్ జెండా ఆవిష్కరించారు.