News March 17, 2024
ప్రతి సోమవారం ప్రజావాణి రద్దు: కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
జిల్లాలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ (కోడ్) ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి కార్యక్రమ తేదీల, వివరాలను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వెల్లడించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
Similar News
News October 11, 2024
కాజీపేట: 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి దండ
హనుమకొండ జిల్లా కాజీపేట వెంకటేశ్వర కాలనీలోని రహమత్ నగర్లో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దుర్గామాత దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అర్చకులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 డాలర్ల నోట్లతో అమ్మవారికి హారం రూపంలో దండ వేశారు.
News October 10, 2024
వరంగల్: బతుకమ్మ వేడుకల్లో అపశృతి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అలంకానిపేట గ్రామంలో బతుకమ్మ వేడుకల్లో యాకయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా యాకయ్య మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. యాకయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News October 10, 2024
HNK: రతన్ టాటా మరణం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు..
నవభారత నిర్మాత, భారత పారిశ్రామిక రంగానికి మార్గదర్శి, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మరణం బాధాకరమని మంత్రులు కొండా సురేఖ, సీతక్క అన్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయుడిగా నిలిచి, భారత సమాజం గర్వించే ప్రపంచ వ్యాపారవేత్తగా రతన్ టాటా నిలిచారని, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు మంత్రులు తెలిపారు.