News March 17, 2024
ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని కలెక్టర్ రంజిత్ భాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలియజేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందనలో అర్జీలు ఇవ్వడానికి రావద్దని ఆయన చెప్పారు.
Similar News
News October 14, 2024
అమరావతి: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం షెడ్యూల్‌ను సీఎం కార్యాలయ అధికారులు విడుదల చేశారు. చంద్రబాబు 12 గంటలకు సచివాలయానికి వస్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో తీసుకువస్తున్న పలు నూతన పాలసీలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఇండస్ట్రియల్, ఎంఎస్ఎంఈ, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, డ్రోన్ డ్రాఫ్ట్ పాలసీలపై విడి విడిగా సీఎం అధికారులతో చర్చిస్తారని కార్యాలయం తెలిపింది.
News October 14, 2024
కర్లపాలెంలో చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి
చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కర్లపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలిక శనివారం సాయంత్రం ఇంటి సమీపంలో కుళాయి వద్ద నీరు పడుతోంది. ఈ క్రమంలో 50ఏళ్ల వయసున్న భాగ్యారావు బాలికకు మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News October 14, 2024
కామన్వెల్త్ పోటీల్లో మంగళగిరి యువతికి 4 పతకాలు
ఈనెల 4 నుంచి 13వ తేదీ వరకు సన్ సిటీ, సౌత్ ఆఫ్రికా దేశంలో జరిగిన కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ సబ్ జూనియర్, జూనియర్ పోటీల్లో మంగళగిరికి చెందిన షేక్ సాదియా అల్మాస్ జూనియర్ 57 కిలోలు విభాగంలో బంగారు పతకం సాధించారు. స్క్వాట్ -185 కిలోల బంగారు పతకం, బెంచ్ ప్రెస్ 95 కిలోల బంగారు పతకం, డెడ్‌లిఫ్ట్ 180 కిలోలు బంగారు పతకం, ఓవర్ల్ 460 కిలోలు బంగారు పతకం, ఓవరాల్ గా నాలుగు బంగారు పతకాలు సాధించారు.