News February 23, 2025
అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు: పీఎం మోదీ

వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ప్రారంభిస్తామని PM మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్‌లో బాగేశ్వర్ ధామ్ మెడికల్&సైన్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే సిగరెట్, బీడీ, పొగాకుకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. క్యాన్సర్‌తో పోరాడేందుకు బడ్జెట్‌లో కొన్ని ప్రకటనలు చేశామని, మందులు చౌకగా లభించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
Similar News
News February 23, 2025
జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ ప్రశాంతం : కలెక్టర్

ఎన్టీఆర్ జిలాల్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని 19 కేంద్రాల్లో 8,792 మంది అభ్యర్థులకు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేయగా.. ఉదయం జరిగిన పేపర్-1కు 83.89 శాతం (7,376), మధ్యాహ్నం పేపర్-2కు 83.62 శాతం (7,352) మంది హాజరైనట్లు వెల్లడించారు.
News February 23, 2025
రేపు పవన్ సినిమా నుంచి సాంగ్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. రేపు ఈ సినిమా నుంచి ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేయనుంది. రేపు మ.3 గంటలకు ఈ పాట విడుదలవుతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను పంచుకుంది. పవన్, నిధి అగర్వాల్ మధ్య ఈ సాంగ్ నడవనున్నట్లు తెలుస్తోంది. మార్చి 28న ఈ సినిమా పార్ట్-1 విడుదల కానుంది.
News February 23, 2025
BREAKING: గ్రూప్-2 ‘ఇనిషియల్ కీ’ విడుదల

AP: ఇవాళ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ‘ఇనిషియల్ కీ’ని APPSC విడుదల చేసింది. https://portal-psc.ap.gov.inలో కీ చూసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రశ్నలు, కీపై సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది. పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కీ కోసం ఇక్కడ <