News October 5, 2024
మద్యపాన ప్రియులకు క్యాన్సర్ ముప్పు
మద్యం ఎక్కువ సేవించేవారికి క్యాన్సర్ ముప్పు అధికంగా ఉంటుందని అమెరికన్ క్యాన్సర్ పరిశోధన సంఘం తాజాగా హెచ్చరించింది. ప్రధానంగా కాలేయం, కడుపు, అన్నవాహిక, పెద్ద పేగు, రొమ్ము, మెడ, తల భాగాలకు క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉంటుందని తెలిపింది. మద్యపానం అదుపులో లేకపోతే జీవన ప్రమాణం గణనీయంగా తగ్గిపోతుందని హెచ్చరించింది. ఆ ఒక్క అలవాటును నియంత్రిస్తే 40శాతం క్యాన్సర్లను తగ్గించవచ్చని పేర్కొంది.
Similar News
News November 5, 2024
నిద్ర లేవగానే ఇలా చేస్తే..
ఉదయం నిద్ర లేవగానే 10-15 నిమిషాలు ధ్యానం చేయండి. ఇది మీ మనసు ప్రశాంతంగా ఉంచడంతో పాటు రోజంతా మీరు సమర్థంగా పనిచేయడానికి దోహదపడుతుంది. ధ్యానం మీ అంతర్గత శక్తిని పెంచుతుంది. సానుకూల ఫలితాల వైపు పయనించేలా చేస్తుంది. అలాగే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో కాసేపు వర్కౌట్స్ చేస్తే కొవ్వు కరుగుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
News November 5, 2024
నేటి నుంచి టెట్ దరఖాస్తులు
TG: విద్యాశాఖ నిన్న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. అభ్యర్థులు <
News November 5, 2024
16.82 లక్షల ఉచిత సిలిండర్ల బుకింగ్
AP: గత నెల 29న ప్రారంభమైన ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం 16.82 లక్షల మంది బుక్ చేసుకోగా, 6.46 లక్షల గ్యాస్ బండలు డెలివరీ అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.16.97 కోట్లు జమ అయ్యాయి. ప్రస్తుతం మహిళలు డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకున్న తర్వాత 1-2 రోజుల్లో ప్రభుత్వం చెల్లిస్తోంది. త్వరలోనే పూర్తి ఉచితంగా ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని CM చంద్రబాబు ఇటీవల ప్రకటించారు.