News February 19, 2025

6నెలల్లో క్యాన్సర్ టీకా అందుబాటులోకి: కేంద్రమంత్రి

image

మహిళల్లో క్యాన్సర్‌ను నివారించేందుకు ఉపయోగపడే టీకాను మరో 6 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర వైద్యారోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ తెలిపారు. 9 ఏళ్ల నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకాలను అందిస్తామని వివరించారు. రొమ్ము, నోరు, గర్భాశయ క్యాన్సర్లను ఈ టీకా నియంత్రిస్తుందని, ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయని చెప్పారు.

Similar News

News March 28, 2025

USతో మా బంధం శాశ్వతంగా ముగిసింది: కెనడా పీఎం

image

USతో ఇన్నేళ్లుగా తమకున్న ఆర్థిక, సైనిక, భద్రతాపరమైన బంధం ఇక ముగిసిపోయిందని కెనడా PM మార్క్ కార్నీ ప్రకటించారు. ‘ట్రంప్ విధించిన సుంకాలు అన్యాయమైనవి. అలా విధించడం మా మధ్య ఇప్పటికే ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే. ఇరు దేశాల బంధాన్ని ట్రంప్ పూర్తిగా మార్చేశారు. ఇక వెనక్కి వెళ్లేది, తగ్గేది లేదు. ఆ దేశానికి తగిన సమాధానాన్ని ఇవ్వనున్నాం. మా ఆత్మగౌరవం, భద్రత మాకు ముఖ్యం’ అని తేల్చిచెప్పారు.

News March 28, 2025

నితిన్ ‘రాబిన్‌హుడ్’ పబ్లిక్ టాక్!

image

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ ఈరోజు రిలీజైంది. ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కామెడీ అదిరిపోయిందని, చాలా నవ్వించారని కొందరు పోస్టులు పెడుతుంటే మరికొందరైతే రొటీన్‌ స్టోరీ అంటున్నారు. డేవిడ్ వార్నర్ సర్‌ప్రైజ్ బాగుందని, కానీ వెంకీ కుడుముల మార్క్ ఎక్కడో మిస్ అయిందంటున్నారు. జీవీ ప్రకాశ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయలేకపోయారని చెబుతున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.

News March 28, 2025

విషాదం: విషమిచ్చిన తల్లి.. ముగ్గురు పిల్లల మృతి!

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు బిడ్డలకు నిన్న రాత్రి పెరుగన్నంలో విషం కలిపి తినిపించి అనంతరం తానూ తీసుకుంది. ఉదయం భర్త వచ్చేసరికి ముగ్గురు బిడ్డలు సాయి కృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) విగతజీవులుగా కనిపించారు. తల్లిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!