News March 17, 2024

కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు పీకేస్తున్నా: రేవంత్ రెడ్డి

image

TG: ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. అవి వాసనలు వెదజల్లుతున్నాయి. ఇప్పటికే కొన్నింటిని పీకేశాను. ఇంకా పీకాల్సినవి ఉన్నాయి. అందుకు రోజుకు 18 గంటలు పనిచేస్తా. గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తా’ అని వెల్లడించారు.

Similar News

News January 26, 2026

‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఎంతంటే?

image

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ నిన్నటి వరకు రూ.350 కోట్ల(గ్రాస్)కు పైగా వసూలు చేసింది. నిన్న జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేశారు. ఈ సినిమా ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన ప్రాంతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ స్పెషల్ రోల్ చేశారు.

News January 26, 2026

NZతో చివరి 2 T20లకు తిలక్ దూరం

image

గాయంతో NZతో జరిగిన తొలి 3 T20లకు దూరమైన తిలక్ చివరి 2 మ్యాచులూ ఆడట్లేదని BCCI తెలిపింది. అతని స్థానంలో శ్రేయస్ జట్టులో కంటిన్యూ అవుతారని వివరించింది. అయితే వచ్చే నెల ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌ నాటికి తిలక్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నం.3లో ఇషాన్ ఆడుతుండగా, తిలక్ జట్టులో జాయిన్ అయితే ఆ స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది.

News January 26, 2026

నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ కాంపా) 8 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://moef.gov.in/