News March 17, 2024
కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు పీకేస్తున్నా: రేవంత్ రెడ్డి

TG: ప్రభుత్వంలో కొందరు అధికారులు కేసీఆర్ కోవర్టులుగా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలు ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. అవి వాసనలు వెదజల్లుతున్నాయి. ఇప్పటికే కొన్నింటిని పీకేశాను. ఇంకా పీకాల్సినవి ఉన్నాయి. అందుకు రోజుకు 18 గంటలు పనిచేస్తా. గంజాయి మొక్క అనేది లేకుండా చేస్తా’ అని వెల్లడించారు.
Similar News
News February 7, 2025
కులగణన మళ్లీ చేయాలి: మాజీ మంత్రి

TG: కులగణన మళ్లీ చేయాలని, రెండోసారి సర్వే చేస్తే ప్రజల్లో ఎలాంటి అయోమయం ఉండదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సర్వే లెక్కల్లో స్పష్టత లేదని, ప్రజలకు ఎన్నో అనుమానాలున్నాయని పేర్కొన్నారు. 2014 కేసీఆర్ సర్కార్ నిర్వహించిన సర్వే కంటే ఇప్పటి సర్వేలో జనాభా 62 లక్షలు తగ్గిందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News February 7, 2025
ఈ ఊళ్లో అసలు చెప్పులు వేసుకోరు..!

AP: తిరుపతికి 50 కి.మీ దూరంలో ఉన్న ఉప్పరపల్లి పంచాయతీ వేమన ఇండ్లు గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ఆ గ్రామానికి కలెక్టర్, సీఎం వచ్చినా ఊరవతల చెప్పులు వదిలి రావాల్సిందే. ఇది వారి తాతముత్తాతల కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. వేంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తితోనే వారు చెప్పులు ధరించరు. బయట ఫుడ్ అసలు తినరు. స్కూళ్లో మధ్యాహ్న భోజనం కూడా ముట్టరు. బయటి వ్యక్తులను తాకరు. అనారోగ్యంగా ఉన్నా ఆస్పత్రులకు వెళ్లరు.
News February 7, 2025
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లలో అనిల్ కుంబ్లే (956) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రవిచంద్రన్ అశ్విన్(765), హర్భజన్ సింగ్ (711), కపిల్ దేవ్ (687), జహీర్ ఖాన్ (610), రవీంద్ర జడేజా (600), జవగళ్ శ్రీనాథ్ (551), మహ్మద్ షమీ (452) ఉన్నారు. ఇవాళ్టి మ్యాచులో జడేజా 600 వికెట్ల ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిలో మీ ఫేవరెట్?