News March 23, 2024

ఓటు వేయాలని బలవంతం చేయలేం: మద్రాసు హైకోర్టు

image

ఓటు వేయాలని ఒకరిని ఎలా బలవంతం చేస్తారని మద్రాసు హైకోర్టు ఓ పిటిషనర్‌ను ప్రశ్నించింది. తమిళనాడు తిరుచ్చెందూర్‌కు చెందిన రామ్‌కుమార్ ‘చట్టప్రకారం ఉద్యోగులు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నారు. వారు ఓటు వేసినట్లు తెలిపే ధ్రువపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేయాలి’ అని పిటిషన్‌ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు.. ధ్రువపత్రం సమర్పించాలని ఆదేశించలేమని తీర్పిచ్చింది.

Similar News

News September 10, 2024

ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ హోదానా? సిగ్గు.. సిగ్గు: KTR

image

TG: ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన <<14061145>>పీఏసీ ఛైర్మన్ <<>>పదవిని, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? అని కేటీఆర్ నిలదీశారు. ‘పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. గీత దాటిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తోంది. పార్లమెంట్‌లో పీఏసీ ఛైర్మన్ పదవిని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్‌కు కట్టబెట్టిన విషయం మరిచారా?’ అని Xలో కేటీఆర్ ప్రశ్నించారు.

News September 9, 2024

రేపు వర్షాలు ఉన్నాయా?

image

రేపు ఉ.8.30 గంటల వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, నిర్మల్, NZB, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD సహా మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలో శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, తూ.గో. జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.

News September 9, 2024

GST కౌన్సిల్‌ భేటీలో ఏపీ ప్రతిపాదనలివే

image

AP: GST కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పలు ప్రతిపాదనలు చేశారు.
✒ ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ సేవలపై GSTని తీసేయాలి.
✒ మద్యం తయారీలో వాడే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను వ్యాట్ పరిధిలోకి తేవాలి.
✒ ఎలక్ట్రిక్ వెహికల్స్ విడి భాగాలపై GSTని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలి.
✒ విద్యాసంస్థలు, వర్సిటీల్లో టెక్నాలజీని ప్రోత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై పన్నును తొలగించాలి.